పాఠశాలకు మంత్రి తల్లి భూ దానం
రాయచూరు రూరల్: విద్యనభ్యసిస్తేనే జీవించడం కష్టంగా మారుతున్న నేటి రోజుల్లో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలకు మంత్రి తల్లి భూదానం చేసిన ఘటన చోటు చేసుకుంది. కొప్పళ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర కన్నడ సంస్కృతి శాఖ మంత్రి శివరాజ తంగడిగి తల్లి హులిగమ్మ మౌలిక సౌకర్యాలు లేని కనకగిరి తాలూకా ఆదాపురలోని ప్రభుత్వ పాఠశాలకు తన పేరు మీద ఉన్న ఎకరా భూమిని దానం చేసింది. ఆ మేరకు కారటిగి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారికంగా గవర్నర్ పేరు మీద రిజిస్టర్ చేసిన కాగితాలను బీఈఓ నటేష్‌కు అందించారు. మంత్రి తంగడిగి ఆమె వెంట ఉన్నారు.


