కాళ్లు లేని వారికి చక్రాల కుర్చీ ఓ వరం. దీన్ని ఇంగ్లీషులో ’గిజ్ఛి్ఛ∙ఇజ్చిజీట’ అంటారు. కాళ్లు లేనివారు ఇందులో కూర్చుని ముందుకు సాగుతారు. వారికే కాకుండా రోగులు, వృద్ధులు, ఎక్కువ దూరం నడవలేని వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఇతరుల సాయం లేకుండా సొంతంగా ముందుకు సాగేందుకు తోడ్పాటును అందిస్తుంది. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నింపిన ఈ చక్రాల కుర్చీ గురించి మీకు తెలుసా?
క్రీ.పూ. 5వ శతాబ్దంలో సంస్కృత వ్యాకరణవేత్త పాణిని తన అష్టాధ్యాయిలో ’పర్ప’ అనే సంస్కృత పదాన్ని ప్రస్తావించారు. అదే నేటి చక్రాల కుర్చీ అని భావిస్తారు. మంచానికి, కుర్చీలకు చక్రాలు బిగించిన ఆధారాలు చైనాలో ఒక రాతి పలకపై లభించాయి. ఇవి క్రీ.పూ. 6వ, 5వ శతాబ్దాల మధ్య కాలానికి చెందినవి.
యూరప్‌లో వీల్‌చైర్ 1595 వరకు ఉనికిలో లేదు. స్పెయిన్‌కు చెందిన ఒక వ్యక్తి ఫిలిప్ రాజు ఐఐ కోసం ఒక కుర్చీని తయారు చేశాడు. డిజైన్‌లో లోపాల కారణంగా దీన్ని నడపడం ఇబ్బందిగా మారింది.

1655లో స్టీఫన్ ఫార్ఫ్లర్ అనే వ్యక్తి 22 ఏళ్లుగా పక్షవాతంతో బాధపడుతూ, తను నడిచేందుకు మూడు చక్రాల చట్రంపై ఓ కుర్చీని తయారుచేశాడు. ఇది వీల్‌చైర్ కన్నా హ్యాండ్‌సైకిల్‌ను పోలి ఉంటుంది. 1760 ప్రాంతంలో ఇన్వాలిడ్ క్యారేజ్ /బాత్ చైర్ సాధారణ వాడుకలోకి వచ్చింది. 1887లో అట్లాంటిక్ నగరానికి వీల్‌చైర్‌లు వచ్చాయి. 1933లో హ్యారీ సి. జెన్నింగ్స్ సీనియర్, అతని దివ్యాంగ స్నేహితుడు హెర్బర్ట్ ఎవరెస్ట్ కలిసి మొదటిసారిగా ఉక్కుతో తయారు చేసిన పోర్టబుల్ వీల్‌చైర్‌ను కనుగొన్నారు. అనంతరం అనేక మార్పులు చెంది ప్రస్తుతం మనం చూస్తున్న వీల్‌చైర్ అందుబాటులోకి వచ్చింది. తోసే అవసరం లేకుండా కంట్రోల్ ద్వారా నడిచే వీల్‌చైర్‌లు సైతం ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చదవండి: Railway Children India వీళ్లు పిల్లల్ని రక్షిస్తారు


