రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్‌..! ధర ఎంత ఉంటుందంటే.. | PM Narendra Modi's Watch Featuring 1947 One Rupee Coin Viral Featuring 1947 One Rupee Coin Viral | Sakshi
Sakshi News home page

PM Narendra Modi's Watch: రూపాయి నాణెంతో కూడిన ప్రధాని మోదీ వాచ్‌..! ధర ఎంత ఉంటుందంటే..

Nov 19 2025 4:56 PM | Updated on Nov 19 2025 6:10 PM

PM Narendra Modi's Watch Featuring 1947 One Rupee Coin Viral Featuring 1947 One Rupee Coin Viral

ప్రధాని నరేంద్ర మోదీని శక్తిమంతమైన నాయకుడిగా అభివర్ణించొచ్చు. ఆయన ఎలాంటి కార్యక్రమాల్లోనైనా భారతీయత ఉట్టిపడే ఫ్యాషన్ శైలిలో కనిపిస్తుంటారు. అందుకు నిదర్శనం ప్రతీ ఏడాది స్వాతంత్ర్య వేడుకల్లో కనిపించే మోదీ లుక్‌. ఆయన మన భారతీయ సంప్రదాయ ఫ్యాషన్‌కు చిహ్నమైన తలపాగ, టైలర్డ్‌ జాకెట్‌తో ఐకానిక్‌ హాఫ్‌ స్లీవ్‌ కుర్తాలలో దర్శనమిస్తుంటారు. 

ప్రతిష్టాత్మకంగా లేదా సాధారణంగా జరిగే వేడుకలకైనా అందుకు అనుగుణమైన స్లైల్‌  స్టేట్‌మెంట్‌తో కనపించడం ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా ఆయన ఫ్యాషన్‌ శైలి భారతీయ సారాంశాన్ని ప్రదర్శిస్తుంది. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. తాజాగా ఆయన చేతికి ధరించే వాచ్‌ అందర్నీ ఆశ్చర్యచకితులను చేసింది. ఆఖరికి దీని విషయంలో కూడా మెదీ తన భారతీయతను వదులుకోలేదంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. మరి ఆ వాచ్‌ స్పెషాలిటీ, దాని ధర తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.

అరుదైన రూపాయి నాణెం..
ఈ వాచ్‌లో 1947 నాటి అరుదైన రూపాయి నాణేన్ని స్పష్టంగా చూడొచ్చు. జైపూర్‌కి చెందిన వాచ్‌కంపెనీ తయారు చేసిన ఈ 43ఎంఎం స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ వాచ్‌ని 'రోమన్‌బాగ్‌' అనిపిలుస్తారు. ఇది జపనీస్‌ మియోటా ఉద్యమం ఆధారితమట. ఇందులో నడిచే పులి ఇమేజ్‌ భారత్ స్వాతంత్ర్య ప్రయాణాన్ని, మేక్‌ ఇన్‌ ఇండియా చొరవను సూచిస్తుంది. ఇక ఈ రూపాయి నాణెంల బ్రిటిష్‌ పాలనలో ముద్రించిన చివరి నాణెం కావడంతో ఈ వాచ్‌ మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది 1946-47లలో ముంద్రించిన నాణెం అని వాచ్‌ని చూడగానే క్లియర్‌గా తెలుస్తుందట. 

ఇది నాలుగు వేరియంట్లలో లభిస్తుందట. ఇందులో బంగారం లేదా వెండి రంగులతో రోమన్‌, దేవనాగరి లిపి సంఖ్యలు ఉంటాయట. లోపల నుంచి యాంటీ-రిఫ్లెక్టివ్ పూత ఉండి, సీ-త్రూ బ్యాక్‌ నీలమణి క్రిస్టల్‌ను ఉంటుంది. ఈ వాచ్‌కి వాటర్‌ ప్రూవ్‌ ఫిచర్‌ కూడా ఉంది. మోదీ ఈ వాచ్‌ని ఈ ఏడాది సెప్టెంబర్‌, నవంబర్‌ మధ్య పలు కార్యక్రమాల్లో ధరించి కనిపించారు. దీని ధర దగ్గర దగ్గర రూ. రూ. 55 వేలు నుంచి రూ. 60 వేలు వరకు పలుకుతుందట.

అందువల్లే హాట్‌టాపిక్‌గా..
జైపూర్ వాచ్ కంపెనీ వ్యవస్థాపకుడు గౌరవ్ మెహతా మాట్లాడుతూ..  ప్రధాని మోదీ ఈ  స్వదేశీ టైమ్‌పీస్‌ను ధరించడంతో ఈ ప్రొడక్ట్‌కి నెట్టింట అమితంగా క్రేజ్‌ ఏర్పడిందన్నారు. నిజానికి సాదాసీదాగా చూస్తే ఈ భారతీయ లగ్జరీ ..ఇవాళ ఆసక్తికరమైన ఆంశంగా మారిపోయిందన్నారు. గతంలో అమితాబ్‌ బచ్చన్‌, ఎడ్‌ షీరాన్‌, రఫ్తార్‌ వంటి వారు కూడా  జైపూర్‌కు చెందిన మెహతా కంపెనీ తయారు చేసిన టైమ్‌పీస్‌లను ధరించి కనిపించేవారు.

(చదవండి: పెళ్లి చేసుకోండి, 20 ఏళ్లలోపు పిల్లలను కనండి.. ఉపాసనకు స్ట్రాంగ్‌ కౌంటర్‌)


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement