సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు వైసీపీ నూతన నియామకాలు చేపట్టింది. ఎన్టీఆర్ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా రాయన భాగ్యలక్ష్మి(విజయవాడ మేయర్)ని, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రయినిధిగా సంపతి విజితలను నియమిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది.


