కర్ణాటకలో మరో కొత్త ఐటీ నగరం రూపుదిద్దుకోబోతోంది. బిడది (Bidadi)లో కొత్త ఐటీ నగరాన్ని నిర్మించ నున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ (DK Shivakumar) చెప్పారు. అనేక దేశాల నాయకులు ఇటీవల బెంగళూరు సందర్శించారని, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ఉన్న బిడదిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ నగరాన్ని ప్లాన్ చేస్తోందని డీకే ప్రకటించారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్ (GBIT) ప్రాజెక్ట్ అంతర్జాతీయ వ్యాపారవేత్తలను ఆకర్షిస్తోందని, గణనీయమైన పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఈ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.
చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్‌ట్యాప్
60 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ మూడు రోజుల పాటు ఐటీ భవిష్యత్తుపై చర్చిస్తుందన్నారు. కర్ణాటకలోని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి,అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ యొక్క బలాలను నొక్కిచెప్పారు. "స్థానిక ప్రతిభ, ఆవిష్కరణ, సాంకేతికత మరియు స్టార్ట్-అప్‌లను సరిగ్గా ప్రోత్సహిస్తే కర్ణాటకను కొత్త దిశలో తీసు కెళతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని తానెపుడూ యువను కోరుతూ ఉంటానన్నారు. అలాగే అవకాశాలను కోరుతూ కర్ణాటకకు వచ్చే వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు.
ఈ సందర్బంగా ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే , కియోనిక్స్ అధిపతి శరత్ బచ్చే గౌడల కృషిని ఆయన ప్రశంసించారు, బెంగళూరు నగరాన్ని ఈ రంగంలో అగ్రగామిగా మార్చడానికి నగర 25 లక్షల ఐటీ నిపుణుల సహకారాన్ని ఆయన కొనియాడారు.ప్రపంచంలో ఇంతటి ప్రతిభ మరెక్కడా లేదని పేర్కొన్నారు శివకుమార్.
ఇదీ చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు


