breaking news
Bidadi
-
ఇన్వెస్టర్ల క్యూ : కొత్త ఐటీ నగరం వచ్చేస్తోంది!
కర్ణాటకలో మరో కొత్త ఐటీ నగరం రూపుదిద్దుకోబోతోంది. బిడది (Bidadi)లో కొత్త ఐటీ నగరాన్ని నిర్మించ నున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకె శివకుమార్ (DK Shivakumar) చెప్పారు. అనేక దేశాల నాయకులు ఇటీవల బెంగళూరు సందర్శించారని, భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహంగా డిప్యూటీ సీఎం ఉన్నారని చెప్పారు. బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.బెంగళూరు-మైసూరు ఎక్స్‌ప్రెస్‌వేలో ఉన్న బిడదిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఐటీ నగరాన్ని ప్లాన్ చేస్తోందని డీకే ప్రకటించారు. గ్రేటర్ బెంగళూరు ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ (GBIT) ప్రాజెక్ట్ అంతర్జాతీయ వ్యాపారవేత్తలను ఆకర్షిస్తోందని, గణనీయమైన పెట్టుబడులకు ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. ఈ పెట్టుబడులను తాము స్వాగతిస్తున్నట్టు చెప్పారు.చదవండి: ఎనిమిదేళ్లనాటి దారుణ హత్యలు : క్లూ ఇచ్చిన ల్యాప్‌ట్యాప్60 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న ఈ సమ్మిట్ మూడు రోజుల పాటు ఐటీ భవిష్యత్తుపై చర్చిస్తుందన్నారు. కర్ణాటకలోని నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి,అభివృద్ధి చెందుతున్న స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ యొక్క బలాలను నొక్కిచెప్పారు. "స్థానిక ప్రతిభ, ఆవిష్కరణ, సాంకేతికత మరియు స్టార్ట్-అప్‌లను సరిగ్గా ప్రోత్సహిస్తే కర్ణాటకను కొత్త దిశలో తీసు కెళతాయన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడాలని తానెపుడూ యువను కోరుతూ ఉంటానన్నారు. అలాగే అవకాశాలను కోరుతూ కర్ణాటకకు వచ్చే వారికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. ఈ సందర్బంగా ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే , కియోనిక్స్ అధిపతి శరత్ బచ్చే గౌడల కృషిని ఆయన ప్రశంసించారు, బెంగళూరు నగరాన్ని ఈ రంగంలో అగ్రగామిగా మార్చడానికి నగర 25 లక్షల ఐటీ నిపుణుల సహకారాన్ని ఆయన కొనియాడారు.ప్రపంచంలో ఇంతటి ప్రతిభ మరెక్కడా లేదని పేర్కొన్నారు శివకుమార్.ఇదీ చదవండి: H-1B వీసాలు ట్రంప్ దెబ్బ : టాప్‌లో ఆ కంపెనీల జోరు -
నిత్యానంద స్వగ్రామ పయనం
బెంగళూరు : వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వగ్రామానికి పయనమవుతున్నారు. బిడది వద్ద 2003లో ధ్యాన పీఠం ఆశ్రమం స్థాపించిన నిత్యానంద సినిమా నటి రంజితతో రాసలీలల సీడీ వెలుగులోకి వచ్చేవరకు అప్రతిహతంగా తన బోధనలు సాగించారు. ఆ తరువాత వరుస వివాదాలు, పోలీస్ కేసులు, అత్యాచారం ఆరోపణలు, వివిధ సంఘాల నిరసనలను ఎదుర్కోవలసిన పరిస్థితి ఏర్పడింది. దాంతో బెంగళూరును వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో తన స్వగ్రామం తమిళనాడులోని తిరువణ్ణామలై వెల్లిపోయి అక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సోమవారం ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రోజు ఆశ్రమంలో ప్రవచనాల సందర్భంగా బిడదిని వదిలి తిరువణ్ణామలైకు వెళ్లిపోవాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇక మళ్లీ ఈ ఆశ్రమానికి రానని చెప్పారు. కోర్టు కేసులకు మాత్రం హాజరవుతానన్నారు. నిత్యానంద మానసికంగా బాగా కుంగిపోయినట్లుగా భక్తులు భావిస్తున్నారు. ** -
స్వామి నిత్యానందపై ఫిర్యాదు
చెన్నై: స్వామి నిత్యానందపై ఓ ఇంజినీర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిత్యానంద నుంచి ప్రకటన హోర్డింగులకు సంబంధించి రూ.70 లక్షల బాకీ ఇచ్చించాలని కోరుతూ తిరుచెంగోడుకు చెందిన కంప్యూటర్ ఇంజినీరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తిరుచెంగోడు వీరరాఘవ మొదలియార్ వీధికి చెందిన సెంగోట్టువేలు (45) కంప్యూటర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఫిర్యాదులో పేర్కొన వివరాల్లోకి వెళితే.... బిడది ఆశ్రమానికి చెందిన నిత్యానంద పరమహంసకు 2011 నుంచి ఆధ్యాత్మిక ప్రకటనలు రూపొందించి సీడీల రూపంలో అందచేశానన్నాడు. దీనికి సంబంధించిన చార్జీలు, రాయల్టీ రూ.70 లక్షల వరకు తనకు రావాల్సి ఉందన్నాడు. ఆ డబ్బును నిత్యానంద నుంచి తనకు అందచేయాలని, అంతేకాకుండా తన ప్రకటన సీడీలు ప్రసారం చేయకుండా నిలిపివేయాలని కోరాడు. తనకు ప్రాణ రక్షణ కల్పించాలని, ఇటీవలి తనపై దాడి చేసిన నలుగురు మహిళా సన్యాసులపై చర్యలు తీసుకోవాలని కోరాడు.


