
విజయవాడ: భవానీపురంలో ఓ కారు డ్రైవర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన యువకుడు. విజయవాడ భవానీపురం సెంటర్లో ఈ ఘటన జరిగింది. భవానీపురం పెట్రోల్ బంక్ వద్ద కారును వెనుక నుంచి బైక్ తో ఢీకొట్టిన గొల్లపూడికి చెందిన చాగంటి అభినవ్ చౌదరి.
కారును ఢీకొట్టడంతో అభినవ్ చౌదరిని నిలదీసిన కారు డ్రైవర్ మనోహర్. మనోహర్ కు అభినవ్ చౌదరికి మధ్య వాగ్వాదం జరిగింది. దాంతో నన్నే ప్రశ్నిస్తావా అంటూ కారు డ్రైవర్ సెల్ ఫోన్ ,కారు కీ లాక్కున్న అభినవ్ చౌదరి.
మాటా మాటా పెరగడంతో కారు కీతో మనోహర్ పై విచక్షణా రహితంగా దాడి చేసిన అభినవ్ చౌదరి. దాడిలో మనోహర్ మెడ పై తీవ్రగాయం అయింది.