
దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) కీలక ప్రకటన విడుదల చేసింది. ఏపీలో విజయవాడ పరిధిలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే.. మరికొన్నింటికి రైళ్ల రాకపోకలు ఆలస్యంగా సాగవచ్చని తెలిపింది. వీటిలో ప్రధానంగా గుంటూరు-విశాఖ మధ్య నడిచే రైళ్లే ప్రధానంగా ఉన్నాయి.
దసరా నేపథ్యంలో.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేసింది. అయితే పండుగ తర్వాతే ఈ అంతరాయం ఉంటుందని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. విజయవాడ డివిజన్ పరిధిలో విజయవాడ-దువ్వాడ నూతన బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్లే ఈ అంతరాయం అని తెలిపింది.
రాజమండ్రి-విశాఖ మధ్య ప్రయాణించే రైలు నంబర్ 67285 ను నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి రాజమండ్రికి ప్రయాణించే రైలు నంబర్ 67286 ను కూడా నవంబర్ 22 నుంచి 25 వరకూ రద్దు చేశారు. గుంటూరు నుంచి విశాఖకు ప్రయాణించే రైలు నంబర్ 17239(సింహాద్రి ఎక్స్ ప్రెస్) ను నవంబర్ 22 నుంచి 24 వరకూ రద్దు చేశారు. అలాగే విశాఖ నుంచి గుంటూరుకు ప్రయాణించే రైలు నంబర్ 17240 (సింహాద్రి ఎక్స్ ప్రెస్)ను నవంబర్ 23 నుంచి 25 వరకూ రద్దు చేశారు.
