
సాక్షి,విజయవాడ: నారాయణ కాలేజీలో ఇంటర్ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. భవానీపురం నారాయణ కాలేజీలో జీవన్ సాయి చదువుతున్నాడు. అయితే,ఈ క్రమంలో మార్కులు తక్కువ వచ్చాయని జీవన్ సాయిని కాలేజీ లెక్చరర్ కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన జీవన్ సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్ధి ఆత్మహత్యపై సమాచారం అందుకున్న భవానిపురం పోలీసులు కేసులు నమోదు చేశారు.
తన కుమారుడి మరణానికి నారాయణ కాలేజీ యాజమాన్యమే కారణమని విద్యార్ధి తల్లి శిరీష కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నాబిడ్డను అందరి ముందు కొట్టారు. నా కొడుకు మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.
జీవన్ సాయి ఆత్మహత్యపై భవానిపురం నారాయణ కాలేజ్ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన చేపట్టాయి. లెక్చరర్ కొట్టడంతో మనోవేదనకు గురై ఆత్మ చేసుకున్న విద్యార్థి ఏమీ పట్టనట్లు కాలేజీ యాజమాన్యం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాలేజీపై కేసు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.