
ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపు
ఉపాధ్యాయులను కూటమి సర్కార్ నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం
సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆవేదన
ఐఆర్, పీఆర్సీ లేవు.. 4 డీఏ బకాయిలూ చెల్లించట్లేదని మండిపాటు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకపోగా.. బోధనేతర పనులతో వేధిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ సమస్యలపై ఎన్నిసార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదని మండిపడింది. కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆగస్ట్‌లో జిల్లా స్థాయిలో ఆందోళనలు చేపట్టినా స్పందించలేదని.. అందుకే ఈనెల 7న ‘చలో విజయవాడ’ పేరుతో మహా ధర్నా చేస్తున్నట్లు ప్రకటించింది. సమాఖ్య చైర్మన్ ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎన్.వెంకటేశ్వర్లు ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు అవుతున్నా ఇప్పటివరకు విద్యా సంస్కరణలపై నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వంలోని అన్ని మేనేజ్‌మెంట్ల ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్విస్ నిబంధనలు తెస్తామని హామీ ఇచ్చి.. ఇప్పటికీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ ఎన్‌క్యా‹Ùమెంట్ వంటి అనేక డిమాండ్లు పరిష్కరించలేదని.. ఐఆర్ ఇవ్వలేదని, పీఆర్సీ నియమించలేదని వాపోయారు.
గత ప్రభుత్వం తెచి్చన హైసూ్కల్ ప్లస్‌లను పూర్తిగా నిర్విర్యం చేశారని.. అక్కడి పోస్టులను సర్‌ప్లస్ చేసి గ్రామీణ బాలికలకు ఉన్నత విద్యను దూరం చేశారని ధ్వజమెత్తారు. తాము ఆరోగ్య బీమా చెల్లిస్తున్నా వైద్యం చేయించుకోలేకపోతున్నామని మండిపడ్డారు. ఉపాధ్యాయులంటే ప్రభుత్వానికి గౌరవం లేదని.. సర్విసులో
ఉంటూ చనిపోయిన వారి కుటుంబాలకు కారుణ్య నియామకాలు కూడా చేపట్టలేదని విమర్శించారు. అందుకే ఈనెల 7న ఉద్యమించబోతున్నట్లు తెలిపారు.
పలు ఉపాధ్యాయ సంఘాల మద్దతు
ఈనెల 7న ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు వైఎస్సార్ టీచర్స్ అసోయేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ కుమార్‌రెడ్డి, గెడ్డం సుధీర్, స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు తమ్మినాన చందనరావు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సైతం ధర్నాకు మద్దతు పలికింది.