విజయవాడ: దుర్గమ్మ వారి గుడిలో అధికారుల మరో నిర్లక్ష్యం బయటపడింది. విజయవాడ దుర్గ గుడిలో భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. శనివారం( జనవరి 10వ తేదీ) ఉచిత ప్రసాదం కౌంటర్ దగ్గర భక్తులు క్యూలైన్‌లో ఉన్న సమయంలో విద్యుత్ షాక్ సంభవించింది. దాంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అధికారులు. దాంతో ప్రసాదం పంపిణీని విద్యుత్ లేకుండానే పంపిణీ చేశారు.
అయితే గత 15 రోజుల నుంచి చూస్తే దుర్గగుడిలో అధికారుల నిర్లక్ష్యం వ్మవహరించడం మూడోసారి. డిసెంబర్ 27వ తేదీ పవర్ కట్ చేశారు. ఆపై నిన్న(శుక్రవారం, జనవరి 9వ తేదీ) శ్రీ చక్ర అర్చనలో ఆవు పాలలో పురుగులు కనిపించడంతో అర్చన నిలిపి వేయాల్సి వచ్చింది. ఆపై ఈరోజు(శనివారం,జనవరి 10 వ తేదీ) విద్యుత్ షాక్ చోటు చేసుకోవడం, కరెంట్ లేకుండానే ప్రసాదం పంపిణీ చేయడం జరిగింది.


