సాక్షి, నల్లగొండ జిల్లా: హైదరాబాద్-విజయవాడ హైవేపై సంక్రాంతి ట్రాఫిక్ రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు పోలీసులు చేపట్టారు. ఎన్‌హెచ్- 65పై రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు తాము సూచించే ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
గుంటూరు → మిర్యాలగూడ → హాలియా → కొండమల్లేపల్లి → చింతపల్లి - మాల్ మీదుగా హైదరాబాద్.
మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు
మాచర్ల → నాగార్జునసాగర్ → పెద్దవూర → కొండపల్లేపల్లి - చింతపల్లి-మాల్ మీదుగా హైదరాబాద్.
నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు
నల్లగొండ - మార్రిగూడ బై పాస్ -మునుగోడు → నారాయణపూర్- చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్.
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలు
కోదాడ- హుజూర్నగర్- మిర్యాలగూడ- హాలియా- చింతపల్లి- మాల్ మీదుగా హైదరాబాద్.
ఎన్‌హెచ్ 65 (విజయవాడ-హైదరాబాద్) రహదారి పై చిట్యాల, పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయిన పక్షంలో చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్


