సాక్షి, విజయవాడ: ఏపీ పోలీసులకు సైబర్ నేరగాళ్ల సవాల్ విసిరారు. సుమారు 80 మంది పోలీసు అధికారులు నుంచి డబ్బులు వసూళ్లు చేశారు. లిక్కర్ కేసు సిట్‌లో ఉన్న కీలక అధికారి పేరుతో వసూళ్లు చేసినట్లు సమాచారం.
లిక్కర్ కేసులో కీలకంగా ఉన్న ఏఎస్పీ.. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశారు. డీజీ స్థాయి అధికారి, డీఐజీ స్థాయి అధికారులు నుండి డబ్బులు వసూళ్లు చేశారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పోలీసులకు సైబర్ నేరగాళ్లు ఝలక్ ఇచ్చారు. సైబర్ దాడితో ఏపీ పోలీసుల్లో కలకలం రేగుతోంది.


