
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, విజయవాడ: నగరంలో భారీగా స్టెరాయిడ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఏనీటైమ్ ఫిట్నెస్ సెంటర్‌లో స్టెరాయిడ్స్‌తో రసూల్ అనే యువకుడు పట్టుబడ్డాడు. జిమ్‌కి వచ్చే యువతకు స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈగల్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా దాడులు చేశాయి. నగరంలోని పలు జిమ్‌లకు కూడా రసూల్ స్టెరాయిడ్స్ సప్లై చేస్తున్నట్లు గుర్తించారు.
సమీర్ అనే హెల్త్ సప్లిమెంట్స్ అమ్మే వ్యక్తితో కలిసి స్టెరాయిడ్స్ అమ్ముతున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న సమీర్ స్నేహితుడు సునీల్ కోసం పటమట పోలీసులు గాలిస్తున్నారు. సునీల్, రసూల్ కలిసి స్టెరాయిడ్స్ అమ్మకాలు చేస్తున్నట్లు పోలీసులు నిర్థారించారు.