సాక్షి,విజయవాడ: రాష్ట్రంలో సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో విద్యార్థులకు కలుషిత నీరు అందించినట్లు సీఎం చంద్రబాబు అంగీకరించారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ..‘హాస్టళ్లలో నీళ్లు సరిగా లేవు, బాత్‌రూమ్‌లు సరిగా లేవు. కలుషిత నీరు ఇవ్వడం వల్ల విద్యార్థులు అనారోగ్యం పాలయ్యారు. ఇది మనందరం సిగ్గుపడే విషయం’ అని అన్నారు.
ఇన్నాళ్లూ మంత్రులు హాస్టళ్లలో నీటి సమస్య లేదని, కలుషితం కాలేదని బుకాయించారు. కానీ ఇటీవల మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాస్టళ్లలోని దుస్థితిని బయటపెట్టారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన ప్రస్తావించగా.. ఇప్పుడు తన పాలనా వైఫల్యాల్ని చంద్రబాబు సైతం అంగీకరించడం గమనార్హం.


