విజయవాడ: నగరంలో ఏపీఈఆర్‌సీ (APERC) బహిరంగ విచారణ చేపట్టిన సందర్భంలో సీపీఎం ఆందోళన బాట పట్టింది. విద్యుత్ చార్జీలు తగ్గించాలంటూ సీపీఎం డిమాండ్ చేసింది. పెంచిన చార్జీలను వెంటనే తగ్గించాలంటూ నినాదాలు చేశారు సీపీఎం నేతలు. ట్రూ ఆఫ్, సర్దుబాటు చార్జీలను రద్దు చేయాలంటూ సీపీఎం శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేశాయి. స్మార్ట్ మీటర్లు పెట్టొద్దని, పెట్టినవి తొలగించాలంటూ సీపీఎం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.
విజయవాడలో ఏపీఈఆర్‌సీ బహిరంగ విచారణలు జనవరి 22,23 తేదీల్లో తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద జరుగుతున్నాయి. ఇవి 2026–27 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ చార్జీల సవరణలపై ప్రజల అభిప్రాయాలను సేకరించడానికి నిర్వహిస్తున్నారు.


