
వైఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. మల్లు రవి, చామల కిరణ్, రోహిన్‌రెడ్డి
ఉమ్మడి ఏపీ అభివృద్ధిపై చెరగని ముద్ర అని నివాళులు
సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమం పరంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి చెరగని ముద్ర వేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశంసించారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి సీఎం ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు, రైతు రుణమాఫీ, జలయజ్ఞం, ఔటర్ రింగ్ రోడ్, పింఛన్ పెంపు వంటి పథకాలతో ప్రజల మనసుల్లో వైఎస్సార్ శాశ్వతంగా నిలిచిపోయారని చెప్పారు. ‘రాహుల్ గాం«దీని దేశ ప్రధాని చేయాలని వైఎస్సార్ కలలు కన్నారు.
ఆయన ఆశయ సాధన దిశగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంది’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అలాగే, మాజీ ప్రధాని చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని సీఎం అధికార నివాసంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రెండు కార్యక్రమాల్లోనూ సీఎంతో పాటు ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, పార్టీ నేతలు ఏపీ జితేందర్ రెడ్డి, రోహిన్‌రెడ్డి పాల్గొన్నారు.