
ఎప్పుడూ బిట్‌కాయిన్, బంగారం వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని చెప్పే.. రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత 'రాబర్ట్ కియోసాకి', ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది ఒక జోక్ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రభుత్వం మూతపడిందా?, ఉద్యోగాల తొలగింపు ఉంటుందా?, మీరు ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నారా?, ఈ మెసేజ్ అర్థమైందా? అంటూనే.. ఉద్యోగ భద్రత ఒక జోక్ అని రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ఉద్యోగిగా కాకుండా వ్యవస్థాపకుడిగా మారడం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.
మార్కెట్లో అనుకోని మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయని రాబర్ట్ కియోసాకి హెచ్చరించారు. 1976 నుంచి అమెరికా వివిధ స్థాయిలలో 22 షట్‌డౌన్‌లను ఎదుర్కొంది. 2018లో 34 రోజులు మార్కెట్ అత్యల్ప స్థాయిలో కొనసాగింది. ఆ తర్వాత స్టాక్‌లు, బిట్‌కాయిన్ రెండూ కోలుకోవడం ప్రారంభించాయి.
ఇదీ చదవండి: చరిత్రలో అతిపెద్ద మార్పు: రాబర్ట్ కియోసాకి హెచ్చరిక
చరిత్ర ప్రకారం.. షట్‌డౌన్‌లు కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. సగటున 2-4 వారాల పాటు ఉంటాయి. ఎలాంటి సమయంలో అయినా.. బిట్‌కాయిన్ బలంగా ఉంటుంది. గత సంవత్సరం మార్చిలో పరిస్థితులు కొంచెం అనిశ్చితంగా కనిపించినప్పుడు, గడువుకు ముందు వారంలో బిట్‌కాయిన్ 16% పెరిగి 62,700 డాలర్ల నుంచి 73600 డాలర్లకు పెరిగింది. ప్రస్తుతం దీని విలువ ఊహకందని రీతిలో భారీగా పెరిగింది.
సొంతంగా వ్యాపారాన్ని ప్రారభించడం లేదా బిట్‌కాయిన్ వంటివాటిలో పెట్టుబడి వంటివి మీకు ఆర్ధిక స్వేచ్ఛను ఇస్తుందని కియోసాకి సందేశం చెబుతోంది. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.
GOVERNMENT SHUT DOWN? MASS FIRINGS?
ARE YOU IN LINE TO BE FIRED?
Got the message?
Job security is a joke.
May be time to consider being an entrepreneur….not an employee.
Take care.— Robert Kiyosaki (@theRealKiyosaki) September 25, 2025