
సాక్షి, తాడేపల్లి: భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధనాకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. వన్డే క్రికెట్‌లో కేవలం 50 బంతుల్లోనే సెంచరీ చేసి రికార్డు సృష్టించటంపై వైఎస్ జగన్ హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా.. స్మృతి మంధానకు హృదయపూర్వక అభినందనలు అంటూ పోస్టు చేశారు.
Heartiest congratulations to Smriti Mandhana for setting the fastest century record in ODI cricket by any Indian in just 50 balls!@mandhana_smriti pic.twitter.com/BwTdKZG956
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 21, 2025
భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన వన్డే క్రికెట్‌లో మరో రికార్డు సృష్టించింది. ఈ ఫార్మాట్‌లో రెండో ఫాస్టెస్ట్ సెంచరీ (50 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా ఘనత సాధించింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో మంధాన (125; 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్స్‌లు) వీరబాదుడుతో ఈ ఫీట్ అందుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆమె 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. దీంతో మహిళల వన్డే క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కింది. తర్వాత కూడా అదే జోరు కొనసాగించిన మంధాన 50 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది. ఓవరాల్‌గా ఆసీస్ ప్లేయర్ మెగ్ లానింగ్ (45 బంతుల్లో) ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది.