ఇంకా పెళ్లి పీటలు ఎక్కడానికి కొన్ని గంటల ముందే భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఆ తతాంగాన్ని వాయిదా వేసుకుంది. స్మృతి తండ్రి శ్రీనివాస్‌కు హార్ట్ ఎటాక్ రావడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. ఈరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత శ్రీనివాస్ అస్వస్థతగా కనిపించారు.
అయితే మహారాష్ట్రలోని సంగ్లీలో పెళ్లి వేడుకకు అంతా సిద్ధమైన వేళ.. మంధాన తండ్రి శ్రీనివాసన్ గుండె పోటుకు గురైనట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని మంధాన మేనేజర్ తుహిన్ మిశ్రా సైతం ధ్రువీకరించాడు. "ఈ పరిస్థితుల్లో తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని మంంధాన తెల్చి చెప్పేసింది.తన తండ్రి పూర్తిగా కోలుకునే వరకు వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి నిర్ణయించుకుందని" తుహిన్ పేర్కొన్నాడు.
ప్రస్తుతం శ్రీనివాస్ సంగ్లీ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. కాగా మంధాన వివాహం సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో ఆదివారం(నవంబర్ 23) జరగాల్సి ఉంది. గత రెండు రోజులగా ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరిగాయి. హాల్డీ, మెహందీ, సంగీత్ కార్యకమాల్లో స్మృతితో పాటు సహచర భారత క్రికెటర్లు సందడి చేశారు. కానీ అంతలోనే ఊహించని సంఘటన చోటు చేసుకోవడంతో పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.


