యాదాద్రి భువనగిరి జిల్లా: కుమారుడి పెళ్లికి రావాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన మలిపెద్ది మాధవరెడ్డి, మాధవి దంపతులు ఊరంతటినీ ఆహ్వానించారు. గ్రామంలోని అన్ని కుటుంబాలను కలిసి బొట్టుపెట్టి పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు చీర అందజేశారు. మాధవరెడ్డి చిన్న కుమారుడు వరుణ్‌కుమార్‌రెడ్డి వివాహం ఆదివారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని వధువు ఇంటి వద్ద జరగనుంది.


