ఖమ్మం జిల్లా: ఖమ్మం జిల్లా వైరా మండలం సోమవరం గ్రామ సమీపాన మంగళవారం ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. శ్రీకాకు«ళం నుంచి ఖమ్మం జిల్లా వైరాకు వడ్డాది రాము (40) వచ్చి స్థిరపడ్డాడు. ఆయనకు ఏపీకే చెందిన వెంకటరత్నం (37)తో వివాహం జరిగింది. రాము వైరాలో వస్త్రదుకాణం నిర్వహిçస్తున్నాడు. వెంకటరత్నం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని గిరిజన గురుకుల పాఠశాలలో టీజీటీగా పనిచేస్తోంది. రాము ట్రాలీ ఆటోలో పాఠశాల నుంచి భార్యను వైరా తీసుకొస్తుండగా లారీ ఢీకొట్టడంతో ఆమె మృతి చెందింది. రాము ఆస్పత్రిలో మరణించాడు.


