
ఐసీసీ ఇవాళ (జులై 22) అప్‌డేటెడ్ వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్స్‌లో (బ్యాటింగ్) టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంధన 727 రేటింగ్ పాయింట్లతో టాప్ ప్లేస్‌లో కొనసాగుతుంది.
గత వారం రోజుల్లో మంధన ఇంగ్లండ్‌పై తొలి రెండు వన్డేల్లో (28, 42) కీలక ఇన్నింగ్స్‌లు ఆడింది. తద్వారా ఆమె తన టాప్ ర్యాంక్‌ను పదిలంగా కాపాడుకుంది. మంధన దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్డ్ట్ కంటే కేవలం రెండు పాయింట్లు అధిక్యంలో ఉంది.
మంధన, వోల్వార్డ్ట్ తర్వాత నాట్ సీవర్ బ్రంట్, ఎల్లిస్ పెర్రీ, అమీ జోన్స్, అలైసా హీలీ, హేలీ మాథ్యూస్, చమారీ ఆటపట్టు, బెత్ మూనీ, యాష్ గార్డ్‌నర్ టాప్-10 బ్యాటర్ల జాబితాలో ఉన్నారు. భారత్ నుంచి మంధన మినహా టాప్-10లో ఎవరూ లేరు. జెమీమా రోడ్రిగెజ్ 15వ స్థానాన్ని నిలబెట్టుకోగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ ఐదు స్థానాలు కోల్పోయి 21వ స్థానానికి పడిపోయింది.
ఈ వారం ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందిన బ్యాటర్లలో దీప్తి శర్మ, సోఫీ డంక్లీ ముందువరుసలో ఉన్నారు. ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ చేసిన దీప్తి.. ఆతర్వాత జరిగిన రెండో వన్డేలోనూ ఓ మోస్తరు ఇన్నింగ్స్‌తో (30 నాటౌట్) ఆకట్టుకుంది. ఫలితంగా ఆమె 10 స్థానాలు ఎగబాకి 23 స్థానానికి చేరుకుంది. భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 83 పరుగులు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ డంక్లీ 24 స్థానాలు మెరుగుపర్చుకొని 52వ స్థానానికి ఎగబాకింది.
భారత్‌తో జరిగిన తొలి వన్డేలో 53 పరుగులతో రాణించిన మరో ఇంగ్లీష్ బ్యాటర్ అలైస్ డేవిడ్‌సన్ రిచర్డ్స్ 40 స్థానాలు మెరుగుపర్చుకొని 118 స్థానానికి చేరింది.
బౌలింగ్ విభాగానికొస్తే.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ర్యాంక్‌ను కాపాడుకోగా.. యాష్ గార్డ్‌నర్, మెగాన్ షట్, దీప్తి శర్మ, కిమ్ గార్త్ టాప్-5 బౌలర్లుగా కొనసాగుతున్నారు. ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్ రెండు స్థానాలు మెరుగుపర్చుకొని టాప్-10లోకి (9వ స్థానం) చేరింది. విండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ ఓ స్థానం మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకింది.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించిన భారత వెటరన్ స్పిన్నర్ స్నేహ్ రాణా 12 స్థానాలు మెరుగుపర్చుకొని కెరీర్ అత్యుత్తమ ర్యాంకింగ్ అయిన 21వ స్థానానికి చేరింది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. ఆష్లే గార్డ్‌నర్, హేలీ మాథ్యూస్, మారిజన్ కాప్ టాప్-3లో కొనసాగుతున్నారు.