
ఉడుమలైలో ఘోరం
బాధిత కుటుంబానికి కోటి ఎక్స్‌గ్రేషియో
డీజీపీతో పాటూ అధికారుల నివాళి
సాక్షి, చెన్నై: విధి నిర్వహణలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్‌ను ఓ ముఠా నరికి చంపేసింది. 100కు వచ్చిన కాల్ మేరకు విచారణకు వెళ్లిన సబ్ ఇన్‌స్పెక్టర్ దారుణ హత్య సమాచారం పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. నిందితుల కోసం ఆరు బృందాలు తీవ్ర వేటలో నిమగ్నమయ్యాయి. బాధిత కుటుంబానికి సీఎం స్టాలిన్ రూ. కోటి ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. వివరాలు.. తిరుప్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని అలంగియం పట్టికి చెందిన షణ్ముగ వేల్ కుడిమంగళం పోలీసు స్టేషన్‌లో స్పెషల్ ఎస్‌ఐగా పనిచేస్తున్నారు.
మంగళవారం రాత్రి ఆయన విధులలో ఉండగా 100కు వచ్చిన కాల్‌తో విచారణ నిమిత్తం అదేగ్రామంలోని ఓ ఎస్టేట్ తోటకు వెళ్లారు. విచారణకు వెళ్లిన షణ్ముగ వేల్ దారుణ హత్యకు గురైన సమాచారం బుధవారం ఉదయాన్నే పోలీసు యంత్రాంగాన్ని కలవరంలో పడేసింది. తిరుప్పూర్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు అందరూ రంగంలోకి దిగారు. ఆరు ప్రత్యేక బృందాలను విచారణకు నియమించారు. విచారణలో సంబంధిత ఎస్టేట్ మడత్తుకుళం అన్నాడీఎంకే ఎమ్మెల్యే మహేంద్రన్‌కు చెందినదిగా తేలింది.
భద్రత కోసం వచ్చి హతమయ్యాడు..
ఈ ఎస్టేట్‌లో దిండిగల్‌కు చెందిన మూర్తి (65), ఆయన కుమారులు తంగపాండి, మణిగండన్ పనిచేస్తుండడం, వారు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అనుమానాలు నెలకొన్నాయి. విచారణలో ఈ తండ్రి కొడుకులు మద్యం మత్తులో తరచూ గొడవ పడుతున్నట్టు, మంగళవారం రాత్రి కూడా ఘర్షణకు దిగినట్టు వెలుగు చూసింది. ఒకర్ని మరొకరు కర్రలతో కొట్టుకుంటుండటంతో 100కు ఫోన్ వెళ్లింది. దీంతో షణ్ముగ వేల్ భద్రత నిమిత్తం అక్కడకు వచ్చి వారిని అడ్డుకున్నట్టు తేలింది. ఈ సమయంలో మణి గండన్ కొడవలితో షణ్ముగ వేల్‌పై దాడి చేసి నరికి పడేశాడు. తప్పించుకునేందుకు షణ్ముగ వేల్ యతి్నంచినా వదలకుండా హత్యకు పాల్పడ్డాడు.
దీనిని షణ్ముగ వేల్‌తో పాటూ వాహనంలో వెళ్లిన డ్రైవర్ గజరాజు చూడడంతో అతడి మీద కూడా దాడికి యతి్నంచారు. అక్కడి నుంచి తప్పించుకుని పోలీసు స్టేషన్‌లో డ్రైవర్ సమాచారం ఇచ్చాడు. అర్ధరాత్రి వేళ పోలీసులు ఆ ఎస్టేట్‌లోకి పరుగులుతీశారు. షణ్ముగవేల్ మృతదేహాన్ని పోస్టుమారా్టనికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేకబృందాలు రంగంలోకి దిగాయి. దర్యాప్తును పోలీసు ఉన్నతాధికారులు వేగవంతం చేయించారు. ఈ సమాచారంతో ఎమ్మెల్యే మహేంద్రన్ ఎస్‌ఐ కుటుంబాన్ని పరామర్శించి తన సానుభూతి తెలియజేశారు.
ఇక సీఎం స్టాలిన్ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి రూ. కోటి ఎక్స్‌గ్రేíÙయో ప్రకటించారు. బుధవారం సాయంత్రం పోస్టుమార్టం అనంతరం షణ్ముగ వేల్ మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఆయన భౌతిక కాయం వద్ద డీజీపీ శంకర్‌జివాల్‌తో పాటూ ఉన్నతాధికారులు నివాళులరి్పంచారు. కాగా, పోలీసులకే రాష్ట్రంలో భద్రత కరువైందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామితో పాటూ ప్రతిపక్ష నేతలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డారు.