
ప్రియుడిపై ఓ యువతి ఆరోపణ
న్యాయం చేయాలని పోలీసులను
ఆశ్రయించిన బాధితురాలు
వికారాబాద్: తనను వివాహం చేసుకుంటానని భర్త నుంచి దూరం చేసిన ప్రియుడు ఆ తర్వాత మోసం చేశాడని ఓ యువతి ఆరోపించింది. ఈ విషయమై మంగళవారం తల్లిదండ్రులతో కలిసి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని, తనకు న్యాయం చేయాలని కోరింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి ఇదే ఊరికి చెందిన మరో యువకుడు ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ ఇష్టంలేని యువతి తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం ఆమెను కర్ణాటకకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు.
పెళ్లయిన నెల రోజుల తర్వాత సదరు యువతి భర్తకు ఫోన్ చేసిన ప్రియుడు తమ ప్రేమ వ్యవహారాన్ని చెప్పాడు. దీంతో యువతిని ఆమె భర్త వదిలేశాడు. అనంతరం తనను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికిన సదరు వ్యక్తి, కాలయాపన చేస్తూ మోసం చేశాడని యువతి ఆరోపించింది. తనకు న్యాయం చేయాలని పోలీసులను కోరింది. ఇదిలా ఉండగా యువతి పీఎస్‌కు వచి్చన మాట వాస్తవమేనని పోలీసులు తెలిపారు. బుధవారం వచ్చి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వెళ్లిపోయారని చెప్పారు.