
నెల్లూరు జిల్లా: వివాహేతర సంబంధాలతో పచ్చని కాపురాన్ని నాశనం చేసుకుంటున్నారు కొంతమంది దంపతులు. ఈ వివాహేతర సంబంధలు చివరకు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా నెల్లూరులో మరో దారుణం చోటు చేసుకోంది. ప్రియుడిని ఇంటికి పిలిచి మరీ హత్య చేసింది ప్రియురాలు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తరుణ్ తేజ్ అనే వ్యక్తికి ప్రవళికతో పెళ్లి కాగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తరుణ్‌కు మాధవి అనే మరో మహిళతో పరిచయం ఏర్పడగా అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
ప్రవళిక సంచలన ఆరోపణలు
అయితే ఎప్పటిలాగే మాధవి ప్రియుడు తరుణ్ తేజ్‌ని ఇంటికి పిలిచింది. కానీ అదే ఇంట్లో తరుణ్ తేజ్ హత్యకు గురయ్యాడు. మార్చురీ వద్ద ప్రవళ్లిక మీడియాతో మాట్లాడుతూ తరుణ్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదన్నారు. అతడిని స్నేహితురాలే హత్య చేసి కప్పిపుచ్చేందుకు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రచారం చేస్తున్నట్లు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.