
అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదు
పూలకుండీలు, ఫర్నిచర్ ధ్వంసం చేసి నిర్వాహకుడు సత్యప్రకాశ్ పై దాడి
మాదాపూర్ : మాదాపూర్‌లో ఉమెన్స్ హస్టల్ నిర్వాహకుడిపై మహిళలు దాడి చేసిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ కృష్ణమోహన్ తెలిపిన మేరకు.. షేక్‌పేటలో ఉంటున్న తల్లిదండ్రులు తన కూతురిని నీట్ ఎగ్జామ్ కౌచింగ్ కోసం జులై 13 నుంచి హస్టల్‌లో ఉంచారు. 10 రోజుల క్రితం నిర్వాహకుడు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని తెలపడంతో బంధువులు, తల్లిదండ్రులు వచ్చి నిర్వాహకుడిపై దాడి చేశారు.
మాదాపూర్ ఇమేజ్‌గార్డెన్ రోడ్డులో ఉన్న అర్ణవ్ ప్లాజాలో ఎన్‌పీపీ ఎగ్జిక్యూటివ్ ఉమెన్స్ హస్టల్‌లో 16 సంవత్సరాల బాలిక ఉంటుంది. బాలికపై హాస్టల్ నిర్వాహకుడు సత్యప్రకాశ్ లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ కొందరు మహిళలు ఆందోళనకు దిగారు. పూలకుండీలను ధ్వంసం చేసి దాడికి దిగారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేశారు.అనంతరం సత్యప్రకాశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులు ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసి నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.