సాక్షి, హైదరాబాద్: నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య చేశాడు. మద్యం తాగే క్రమంలో గ్లాస్ కోసం గొడవ జరిగింది. మూడంతస్తుల భవనంపై నుంచి అన్నను తమ్ముడు తోసేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వరంగల్‌లో..
మరో ఘటనలో వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఈరియా తండాలో ఓ యువకుడిపై దాడికి పాల్పడ్డారు. బెల్ట్ షాప్ వద్ద మద్యం కోసం వచ్చిన గణేష్ అనే యువకుడిపై దంపతులు రోకలి బండతో దాడి చేశారు. గణేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరతలించారు. దాడి చేసిన దంపతులు ఇంటికి తాళం వేసి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


