
విజయనగరం: మండలంలోని కెరటం గ్రామంలో ఈ నెల 9వ తేదీన అనుమానాస్పదంగా మృతి చెందిన నిడిగేట్టి కృష్ణ మృతికి గల కారణం ఆయన భార్యకు మేనల్లుడు సాయితో ఉన్న వివాహేతర సంబంధమేనని గజపతినగరం సీఐ జీఏవీ రమణ తెలిపారు. ఇదే కేసు వివరాలను బొండపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం సాయంత్రం వెల్లడించారు. మృతుడు నీడిగేటి కృష్ణను నారపాటి సాయి ఈ నెల 9న మద్యం తాగుదామని పిలిచి గ్రామం బయటకు తీసుకుని వెళ్లి అక్కడ అతడి పీక నులిమి హత్య చేసినట్లు పేర్కొన్నారు.
ఈ హత్య ఘటనలో ప్రధాన నిందితుడు సాయి కాగా మృతుడి భార్య రాజు రెండవ నిందితురాలని, మృతుని కొడుకు మైనర్ కూడా హత్యలో పాల్గొన్నట్లు తెలిసిందన్నారు. ప్రధాన నిందితుడు సాయిని బిళ్లలవలస వద్ద గురువారం సాయంత్రం పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. సమావేశంలో ఎస్‌ఐ మహేష్ తదితరులు పాల్గొన్నారు.