
బంజారాహిల్స్/లంగర్‌హౌస్: భార్యను మోసం చేస్తూ మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పాటు చేసుకున్న వ్యక్తిని లంగర్‌హౌస్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నగరానికి చెందిన ఫరీసా షాహీన్ 1990లో సౌదీ అరేబియా వెళ్లారు. అక్కడ పాకిస్థానీ జాతీయుడు సాహెద్ అఖిల్‌ను వివాహం చేసుకున్నారు. .
వీరికి 1991లో ఫహద్ అఖీల్ గోందల్ జన్మించాడు. భర్త చనిపోయిన తర్వాత ఫరీసా 1998లో నగరానికి వచ్చి స్థిరపడ్డారు. నగరంలోని విద్యనభ్యసించిన ఫహద్ ప్రస్తుతం ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో అసోసియేట్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉప్పల్‌లోని సంస్థలో పని చేసినప్పుడు అక్కడే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన మహిళను వివాహం చేసుకుని లంగర్‌హౌస్ నేతాజీనగర్‌లో నివసిస్తున్నారు.
ఫహద్‌కు ఏడాది క్రితం మరో మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దాని తీసింది. వీళ్లిద్దరూ బంజారాహిల్స్‌లోని ఓ ఫ్లాట్‌లో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన ఫహద్ భార్య తొమ్మిది నెలలుగా దూరంగా ఉంటోంది. గురువారం రాత్రి ఫహద్ ఆ మహిళతో కలిసి ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చింది. అక్కడకు చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు ఫహద్‌ను లంగర్‌హౌస్ ఠాణాకు తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు ఫహద్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు అరెస్టు చేశారు.