నవాబుపేట/షాద్‌నగర్ రూరల్: తమ్ముడి ప్రేమ పెళ్లికి సహకరించాడనే కోపంతో అన్నను కిడ్నాప్ చేసి, దారుణంగా హతమార్చిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలం యన్మన్‌గండ్లలో వెలుగు చూసింది. నవాబుపేట ఎస్‌ఐ విక్రమ్ కథనం ప్రకారం.. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగ ర్ మండలంలోని ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్ (35) ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ జీవనం సాగిస్తున్నా డు. వీరి కుటుంబం షాద్‌నగర్‌లోని అయ్యప్పకాలనీలో నివాసం ఉంటోంది. రాజశేఖర్ తమ్ముడు చంద్రశేఖర్ ఆటో నడుపుతూ ఉపాధి పొందుతున్నాడు.
చంద్రశేఖర్ వారి స్వగ్రామమైన ఎల్లంపల్లికి చెంది న ఒక యువతిని చాలారోజు లుగా ప్రేమిస్తున్నాడు. ఈ నెల 8న చంద్రశేఖర్ తాను ప్రేమించిన యువతితో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబసభ్యులు ఎంత వెతికినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఈ నెల 12న యువతి సోద రుడు వెంకటేశ్.. చంద్రశేఖర్‌కు అతని అన్న రాజశేఖర్ సహకరించాడన్న కోపంతో మరికొందరితో కలిసి రాజశేఖర్ ఇంటికి వచ్చాడు. మాట్లాడుతామ ని బయటికి తీసుకొచ్చి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం మార్గమధ్యలో కొట్టి చంపేశారు.
తర్వాత నవాబుపేట మండలంలోని యన్మన్‌గండ్ల గ్రామ సమీపంలో రోడ్డు పక్కన చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసి పెట్రోల్ పోసి నిప్పంటించారు. రాజశేఖర్ ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 13న యన్మన్‌గండ్లలో స్థానికులు సగం కాలిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. నవాబుపేట పోలీసులు విచారణ చేపట్టగా షాద్‌నగర్‌లో కిడ్నాప్ అయిన రాజశేఖర్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు హత్య కేసు నమోదు చేసిన నవా బుపేట పోలీసులు శనివారం బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించారు.విచారణ ముగిసిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని ఎస్‌ఐ తెలిపారు.


