కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి | Rowdy-Sheeter Lokendra Brutally Murdered in Dharmavaram, Sri Sathya Sai District | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి

Sep 5 2025 11:59 AM | Updated on Sep 5 2025 2:49 PM

Dharmavaram Rowdy Sheeter Incident

ధర్మవరంలో రౌడీ షీటర్‌  దారుణ హత్య 

బైక్‌పై వెళ్తుండగా దాడి.. సీసీ కెమెరాల్లో నిక్షిప్తం 

హతుడు పలు హత్య కేసుల్లో నిందితుడు  

దర్మవరం అర్బన్‌: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో పట్టపగలే దారుణ హత్య జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఓ రౌడీషీటర్‌ను కొందరు వ్యక్తులు కారుతో ఢీ కొట్టి వేట కొడవళ్లతో నరికి  చంపేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధర్మవరం కొత్తపేటకు చెందిన తలారి లోకేంద్ర(26) గురువారం స్నేహితుడితో కలిసి బైక్‌పై వెళ్తూ శ్రీనిధి మార్ట్‌ వద్ద ఆగాడు. ఇంతలో వెనుకనుంచి వేగంగా వచ్చిన కారు అతడి బైక్‌ను ఢీకొట్టింది. 

కిందపడిపోయిన లోకేంద్రపై కారులో నుంచి దిగిన ఇద్దరు వ్యక్తులు వేట కొడవళ్లతో దాడి చేశారు. ముఖం, మెడపైన అతి కిరాతకంగా నరికారు. అనంతరం అదే కారులో వెళ్లిపోయారు. ఇందతా సీసీ కెమెరాలో రికార్డయింది. హత్య జరిగిన  స్థలాన్ని ఇంచార్జి సీఐ నాగేంద్రప్రసాద్‌ పరిశీలించారు. లోకేంద్ర తండ్రి బైరవుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

లోకేంద్ర హంతకులు నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయినట్లు సమాచారం. కొత్తపేటలో బొప్పాయి కాయలు విక్రయించే బైరవుడు కుమారుడైన లోకేంద్ర అవివాహితుడు. గంజాయి తాగుతూ జులాయిగా తిరుగుతున్నాడు. ఏడాది క్రితం రైల్వే స్టేషన్‌లో రూ.15 ఆటో బాడుగ విషయంలో శ్రీనివాసులురెడ్డి అనే వృద్ధుడిని బండరాళ్లతో కొట్టి హత్య చేసిన కేసులో, 6 నెలల క్రితం ఓ మహిళను ఆటోలో తీసుకెళ్లి రేగాటిపల్లి పొలాల్లో హత్యాచారం చేసిన కేసులోనూ ప్రధాన నిందితుడు. 2019లో హోంగార్డుపై దాడి చేశాడు. దీంతో లోకేంద్రపై పోలీసులు రౌడీïÙట్‌ తెరిచార 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement