సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
తల్లికి అనారోగ్యం..మనస్తాపం చెందిన బాలిక
జంగారెడ్డిగూడెంలో ఘటన
ఏలూరు జిల్లా: ‘నాన్నా.. అమ్మను బాగా చూసుకో.. ఏమీ అనవద్దు.. ఐ మిస్ యూ.. మావయ్య.. సారీ.. ఐ మిస్ యూ... చెల్లెళ్లిద్దరూ బంగారం.. వా రిని బాగా చదివించండి.. మా ప్రిన్సిపాల్, హౌస్ టీచర్ చాలా మంచివాళ్లు.. ఏమీ అనవద్దు..’ అని సూసైడ్ నోట్ రాసి గురుకుల విద్యార్థిని బలవన్మరణం చెందింది. పోలీసులు, పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపిన వివరాల ప్రకారం..
జంగారెడ్డిగూడెం బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థిని పొడవాటి కావ్య (15) శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో పిల్లలందరూ భో జనానికి వెళ్లగా తరగతి గదిలో ఫ్యాన్‌కు చున్నీతో ఉ రివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సీఐ ఎంవీ సు భా‹Ù, ఎస్సై ఎన్‌వీ ప్రసాద్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రిన్సిపాల్ గంగాభవాని, మహిళా టీచ ర్లు, కావ్య స్నేహితులను విచారించారు. సీసీ టీవీ రికార్డులను పరిశీలించారు. కావ్య స్నేహితులు మాట్లాడుతూ కావ్య తల్లి ఉషారాణి కిడ్నీ సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్నారని, తరచూ డ యాలసిస్ చేయాల్సి రావడంతో కుటుంబం ఇబ్బంది పడుతోందన్నారు.
ఈ నేపథ్యంలో తన తల్లి బాధను చూడలేక చదువు మానేయాలని ఉందని పలుమార్లు తమకు చెప్పిందని అన్నారు. తల్లి అనారోగ్యంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు. కావ్యకు ఇద్దరు చెల్లెళ్లు ఉండగా, పెద్ద చెల్లెలు సౌమ్య ఇదే గురుకుల పాఠశాలలో 6వ తరగతి చదువుతోంది. తాడువాయి పంచాయతీ జొన్నవారిగూడెం గ్రామానికి చెందిన పొడపాటి గంగాధరరావు, ఉషారాణి పెద్ద కుమార్తె కావ్య. ఆమె మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. పాఠశాల వద్ద పీడీఎస్‌యూ, దళిత సంఘాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కొద్దిసేపు ఆందోళన చేశారు.


