లా అండ్‌ ఆర్డర్‌ విషయంలోనూ చంద్రబాబు మోసమే! | Kakani Govardhan Reddy Fires On Chandrababu Government | Sakshi
Sakshi News home page

లా అండ్‌ ఆర్డర్‌ విషయంలోనూ చంద్రబాబు మోసమే!

Nov 29 2025 6:55 PM | Updated on Nov 29 2025 7:26 PM

Kakani Govardhan Reddy Fires On Chandrababu Government

సాక్షి, నెల్లూరు జిల్లా: రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని.. అందుకు నిదర్శనమే ప్రజా ఉద్యమకారుడు పెంచలయ్య దారుణ హత్య అని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం మాదకద్రవ్యాలపై పోరాటం చేస్తున్నాడనే కారణంతోనే పెంచలయ్యను హత్య చేశారన్నారు. 

‘‘హత్య చేసిన నిందితులు మరోవైపు పోలీసులపై దాడి చేశారు. డ్రగ్స్ మాఫియా పోలీసులపైనే తిరగబడుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అంటూ కాకాణి ప్రశ్నించారు. ‘‘ఏపీని గంజాయి, డ్రాగ్స్ హబ్‌గా చంద్రబాబు మార్చారు. వంద రోజుల్లో గంజాయి నిర్ములిస్తానన్న చంద్రబాబు.. నేడు 555 రోజులవుతుంది అధికారం చేపట్టి.. నేడు శాంతి భద్రతల విషయంలో కూడా మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు ఇప్పటికైనా కనువిప్పు కలుగుతుందని నేను అనుకోవడం లేదు. లోకేష్ ఆధ్వర్యంలో ఏదో సబ్ కమిటీ అన్నారు. ఏం వెలగబెట్టాడో సమాధానం చెప్పాలి.

..విశాఖ కేంద్రంగా జాతీయ డ్రగ్స్ ముఠా లావాదేవీలు జరుపుతున్న తీరు చూశాం. ఇతర దేశస్థులు వచ్చి రాష్ట్రంలో ఇలాంటి మాదకద్రవ్యాల సరఫరా సాగిస్తుంటే నిఘా వర్గం ఏం చేస్తోంది?. కేవలం ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా ఇంటిలిజెన్స్ పనిచేస్తుంది తప్ప ఇంకోటి లేదు’ అంటూ కాకాణి మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement