రేపు వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన | Ys Jagan Nellore Tour Schedule On July 31st | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటన

Jul 30 2025 6:05 PM | Updated on Jul 30 2025 6:39 PM

Ys Jagan Nellore Tour Schedule On July 31st

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి‌న అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్‌ జగన్‌ మాట్లాడనున్నారు.

ఉదయం 9.00 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి నెల్లూరు చేరుకుంటారు. అక్కడ జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డిని ములాఖత్ ద్వారా కలిసి, అనంతరం కాకాణి కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అక్కడినుంచి నెల్లూరు సుజాతమ్మ కాలనీకి చేరుకుని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో ఆయన, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement