రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన కాకాణి
వెంకటగిరి (సైదాపురం): రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ నిలిపివేతకు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వాల లోపాయికారీ ఒప్పందాలు నిజమా ? కాదా ? అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో శనివారం వైఎస్సార్‌సీపీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడిన తర్వాతే నిలిపివేశారని ఆరోపించారు. చంద్రబాబు లోపాయికారితనం ఒప్పందంతో రైతులు అన్యాయం అయిపోతారన్న ఉద్దేశంతో సోమశిల–కండలేరు వద్ద చేపట్టిన ఆందోళనకు నెల్లూరు జిల్లా నుంచి అన్ని నియోజకవర్గాల్లో ఉన్న వందలాది మంది అన్నదాతలు తమకు సంఘీభావం తెలిపారన్నారు. అయితే వందలాది మంది పోలీసులను పంపి అన్యాయంగా అరెస్టు చేయించి పోలీసుస్టేషన్‌కు తరలించారన్నారు.
అదే ప్రాజెక్టుకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు నలుగురు పోతే వారి వెంట నలుగురు రైతులు కూడా లేరన్నారు. కూటమి ప్రభుత్వంలో లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించామని మాయమాటలు చెబుతున్నారని.. వారికి దమ్ము, ధైర్యం ఉంటే ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో సచివాలయాల వారీగా జాబితా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రెడ్‌బుక్ రాజ్యాంగం పాలన నడుస్తోందని వైఎస్సార్‌సీపీ తిరుపతి పార్లమెంట్ పరిశీలకులు, మేడా రఘునాథరెడ్డి విమర్శించారు.
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై బాబు దుష్ప్రచారం
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై కూటమి ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని తిరుపతి ఎంపీ గురుమూర్తి విమర్శించారు. భూముల రీసర్వేతో ఎంతోమంది రైతులకు మేలు జరిగిందని, దీంతో జగన్‌మోహన్‌రెడ్డికి మంచి పేరు వస్తుందనే అక్కసుతో చంద్రబాబు, ఎల్లో గ్యాంగ్ ఎన్నికల ముందు దు్రష్పచారంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు.
రీసర్వేలో ఏపీ ప్లాటినం గ్రేడింగ్ సాధించిందని 2023లోనే పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచి్చందన్నారు. అందుకు ప్రతిఫలంగా 2025 ఫిబ్రవరి 19న రాష్ట్ర ప్రభుత్వానికి రూ.400 కోట్ల నిధులను కేంద్రం రాయితీ రూపంలో మంజూరు చేసిందన్నారు. దీనిని సీఎం చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యంత్రిని చేసుకునేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకురాలు కోడూరు కల్పలత, ఎస్‌ఈసీ సభ్యులు బొలిగర్ల మస్తాన్‌యాదవ్, పాపకన్ను మధుసూదన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ బి.వెంకటరమణారెడ్డి, సనత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


