సాక్షి, నెల్లూరు జిల్లా: మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై మరో అక్రమ కేసు నమోదైంది. రాజకీయ విమర్శలు ఎదుర్కొలేక కాకాణిపై సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. వెంకటాచలం పీఎస్‌లో సోమిరెడ్డి అనుచరులు ఫిర్యాదు చేశారు. కాకాణిపై కేసు నమోదు చేయాలని సోమిరెడ్డి ఆదేశాలు చేయగా.. కక్ష సాధింపులో భాగంగా కాకాణిపై అక్రమ కేసు నమోదు చేశారు.
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎప్పటికప్పుడు నిలదీస్తుండటంతో కాకాణిపై చంద్రబాబు సర్కార్ కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం.. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా సర్కారు పెద్దల బరితెగింపు హద్దులు మీరుతోంది. ప్రశ్నించే వారే ఉండకూడదని హూంకరిస్తూ నిత్యం తప్పుడు కేసులతో చెలరేగిపోతోంది.
ఈ ఏడాది మే నెలలో కాకాణి గోవర్ధన్‌రెడ్డిని నెల్లూరు పోలీసులు కక్షపూరితంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 85 రోజులు జైల్లో ఉన్న ఆయన కాకాణి గోవర్దన్‌రెడ్డి.. బెయిల్ రావడంతో బయటకువచ్చారు. అక్రమ కేసులు బనాయించడంతో.. కూటమి ప్రభుత్వం ఆయన న్యాయ పోరాటం చేస్తున్నారు.


