
సాక్షి, నెల్లూరు: సర్వేపల్లిలో గ్రావెల్‌కు అనుమతులుంటే చూపాలంటూ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపరులు ఎవరో సీబీఐ విచారణ వేయించుకుందాం. సీబీఐ విచారణకు నేను సిద్ధం, సోమిరెడ్డి సిద్ధమా?. సీబీఐ ఎవరికి క్లీన్ చిట్ ఇస్తే.. వాళ్లే పోటీ చేయాలని కాకాణి అన్నారు.
అచ్చెన్నాయుడికి దమ్ముంటే యూరియా కొరతపై బహిరంగ చర్చకు రావాలన్న కాకాణి.. డిమాండ్ వున్న ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పరిశీలనకు సిద్ధమా అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వంలో రైతుల గోడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఒక వైపు యూరియా కొరత.. మరో వైపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు శూన్యం. సోమిరెడ్డికి వైఎస్ జగన్ గురించి మాట్లాడే స్థాయి లేదు. ఏదో జగన్‌ను విమర్శిస్తే మంత్రి పదవి వస్తుందని నోరు పారేసుకోకు అంటూ కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు.