
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కాకాణిపై మైనింగ్ పేరుతో పోలీసులు అక్రమ కేసు నమోదు చేశారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డిని రెండు నెలలుగా పోలీసులు టార్గెట్ చేశారు.
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధిని గాలికొదిలేసి.. చంద్రబాబు సర్కార్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. పొదలకురు మండలం రుస్తుం మైన్ కేసులో కాకాణిని పోలీసులు ఇరికించారు. ప్రభుత్వం వైఫల్యాలు, చంద్రబాబు దోపిడీ విధానాలను విమర్శించినందుకు కక్ష కట్టిన ప్రభుత్వం.. మాజీ మంత్రి సోమిరెడ్డి మైనింగ్‌ని బయటపెట్టినందుకు ఎదురు కేసులు పెట్టించి వేధిస్తోంది.
క్వార్జ్ మైనింగ్ మైనింగ్‌పై తప్పుడు నివేదికతో కాకాణిపై కేసు నమోదు చేశారు. రుస్తుంలో ఎలాంటి అక్రమ మైనింగ్ జరగలేదని గతంలోనే మైనింగ్ అధికారులు నివేదిక ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే అదే మైనింగ్ డీడీ బాలాజీ నాయక్ ద్వారా అక్రమ మైనింగ్ జరిగిందంటూ ఫిర్యాదు చేయించారు. ఓ వైపు క్వార్జ్‌ను టీడీపీ నేతలు యథేచ్ఛగా దోచుకుంటున్నారు. మరోవైపు, వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. కాకాణిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.