3న నెల్లూరుకు వైఎస్‌ జగన్‌ | YS Jagan to visit Nellore District on July 3 | Sakshi
Sakshi News home page

3న నెల్లూరుకు వైఎస్‌ జగన్‌

Jun 23 2025 3:05 AM | Updated on Jun 23 2025 6:16 AM

YS Jagan to visit Nellore District on July 3

కాకాణికి పరామర్శ 

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ జూలై 3న నెల్లూరు రానున్నారు. సెంట్రల్‌ జైల్‌లో ఉన్న మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డిని ములాఖత్‌లో పరామర్శిస్తారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.

ఆదివారం నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్సీ మేరిగ మురళి, సూళ్లూరుపేట సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య తదితరులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాకాణిని కలిసిన అనంతరం వారి కుటుంబ సభ్యులను కూడా వైఎస్‌ జగన్‌ పరామర్శిస్తారని తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement