
సాక్షి, తిరుపతి జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా అంత ఒక్కతాటిపై ఉండి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి అండగా ఉంటాం.. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవుతుంది. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడరు. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది’’ అని అనిల్ చెప్పారు.
వైఎస్సార్‌సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ జైలుకు పంపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారు
వెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. సీఎం చంద్రబాబును ఇళ్లకు పంపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఇల్లు సాధ్యం కాదని.., చంద్రబాబుకు మాత్రమే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రజలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారు
ఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ.. నిరాధారమైన ఆరోపణలతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులకు వైఎస్సార్‌సీపీ నాయకులు భయపడరు.
ఎమ్మెల్సీ చంద్ర శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా చరిత్రలో తప్పుడు కేసులతో మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఘటన ఎప్పుడు జరగలేదు. జూన్ 4 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం బలంగా నిర్వహిస్తాం. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం
