టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్‌ | Tjr Sudhakar Babu Fires On Tdp Mp Putta Mahesh Kumar | Sakshi
Sakshi News home page

టీడీపీ.. తెలుగు డ్రగ్స్ పార్టీగా మారింది: టీజేఆర్‌

Mar 15 2026 11:51 AM | Updated on Mar 15 2026 1:24 PM

Tjr Sudhakar Babu Fires On Tdp Mp Putta Mahesh Kumar

సాక్షి, తాడేపల్లి: పుట్టా మహేష్‌ను ఎంపీ పదవి నుంచి తొలగించాలంటూ వైఎస్సార్‌సీపీ నేత టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌  చేశారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. టీడీపీ.. తెలుగు డ్రగ్‌ పార్టీగా మారిపోయిందన్నారు. టీడీపీ ఎంపీ మద్యం తాగుతూ డ్రగ్స్ తీసుకోవడం సిగ్గుచేటు. క్యారెక్టర్‌ లేని వ్యక్తులను చంద్రబాబు లోక్‌సభకు పంపారు. పార్లమెంట్‌లో అడుగుపెట్టే నైతిక హక్కు మహేష్‌కు లేదు’’ అంటూ టీజేఆర్‌ మండిపడ్డారు.

‘‘రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేలా టీడీపీ నేతలు వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ డ్రగ్స్ కేసులో దొరకటం సిగ్గుచేటు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్‌కు పార్లమెంటుకు వెళ్లే అర్హత లేదు. ఎంపీ మహేష్‌ను వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. ఎంపీ పదవి నుండి తొలగించాలి. డ్రగ్స్ నెట్‌వర్క్‌తో ఎంపీ పుట్టాకు సంబంధం ఉంది. రాజస్థాన్‌కి చెందిన మాజీ ఎమ్మెల్యేని డ్రగ్స్ పార్టీకి పిలవడమే ఇందుకు నిదర్శనం. టీడీపీ నేతలు బరితెగించారు.

..తప్పులు చేసి కూడా అయితే ఏంటంటా? అంటున్నారు. ఎంపీ పుట్టా మహేష్ అనేకమంది యువత జీవితాలను పెడదోవ పట్టించేలా వ్యవహరించారు. టీటీడీకి ఛైర్మన్‌గా పని చేసిన సుధాకర్ యాదవ్ కొడుకే ఎంపీ మహేష్. టీటీడీ ప్రస్తుత ఛైర్మన్ బీఆర్ నాయుడు ఇటీవలే వీడియోలతో దొరికాడు. అయినాసరే చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

..ఇప్పుడు పుట్టా మహేష్ విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు. పుట్టా మహేష్ యాదవ్ కు పార్లమెంటులోకి ప్రవేశించే అర్హత లేదు. ఆయన్ను ఎంపీ పదవి నుండి వెంటనే తొలగించాలి. గుంటూరు, విజయవాడ, అమరావతిలో ఇటీవల డ్రగ్స్, గంజాయి విపరీతంగా దొరుకుతోంది. అయినాసరే చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. చంద్రబాబుకు రేవంత్, రాహుల్ గాంధీతో హాట్ లైన్‌ సంబంధం ఉంది.

 

 

కాబట్టి రేవంత్‌తో మాట్కాడి పుట్టా కేసును నీరుగార్చుతారనే అనుమానం ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్‌తో తిరుగుతున్న వ్యక్తి చంద్రబాబు. అలాంటి చంద్రబాబును ఎలా నమ్ముతున్నారో బీజేపీ, జనసేనకే తెలియాలి. రాయలసీమ లిఫ్టును కాంగ్రెస్ సీఎం అడిగాడని చంద్రబాబు ఆపేశారు. చంద్రబాబుతో సంబంధం లేకపోతే రేవంత్ రెడ్డి వెంటనే ఎంపీ మహేష్ పై చర్యలు తీసుకోవాలి. తెలంగాణ పోలీసుల నిజాయితీకి ఇది పరీక్ష. రెండు రాష్ట్రాలను డ్రగ్స్ రాష్ట్రాలుగా మార్చటం సిగ్గుచేటు’’ అంటూ టీజేఆర్‌ సుధాకర్‌బాబు మండిపడ్డారు.

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement