breaking news
putta
-
సంక్రాంతి సంబరాల్లో కూటమి నేతల మాఫియా: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: సంక్రాంతి సంబరాల పేరిట కోడి పందేలు నిర్వహించి వేల కోట్లు దోపిడి చేసేలా కూటమి నాయకులు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. కూటమి ప్రజాప్రతినిధుల అండదండలతో రాష్ట్ర వ్యాప్తంగా 450కి పైగా బరులు సిద్ధం చేశారని, ప్రతి నిర్వాహకుడి నుంచి కోటి నుంచి కోటిన్నర వరకు వసూలు చేస్తున్నారని ఆయన తెలిపారు.అంతే కాకుండా ఒక్కో బరి వద్ద సగటున 40 వరకు పందేలు నిర్వహిస్తారని, ఒక్కో పందెం విలువ విలువ రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంటుందని, అందులోనూ కూటమి ప్రజాప్రతినిధులకు వాటాలు చెల్లించేలా ఒప్పందాలు జరిగాయని చెప్పారు. ఇవే కాకుండా ఆ కోడి పందేల బరుల వద్ద ఫుడ్ స్టాళ్లు, లిక్కర్ అమ్మకాలు, కూల్ డ్రింక్స్, పేకాట డెన్లు నిర్వహిస్తూ అధికార పార్టీ నాయకులు మరో భారీ దోపిడీకి తెరదీశారని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పుత్తా శివశంకర్ వివరించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే..:సంక్రాంతి సంబరాల్లో ‘కేపీఎల్’:క్రికెట్లో ఐపీఎల్ తరహాలో, ఈ సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రంలో ‘కేపీఎల్’ (కోడి పందేల లీగ్)కు సిద్ధమయ్యారు. అందుకోసం ఎక్కడికక్కడ కూటమి నేతలు, నాయకులు ఒక మాఫియాలా మారి, రాష్ట్రమంతా భారీ ఏర్పాట్లు చేశారు. అసలు కోడి పందేలను నిర్వహించకూడదని హైకోర్టు ఆదేశాలు స్పష్టంగా ఉన్నా, వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ, పోలీసులతో కుమ్మక్కై వాటి ద్వారా వేల కోట్లు దోచుకునేందుకు కూటమి నాయకులు ఈ సంక్రాంతి సంబరాల్లో స్కెచ్ వేసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కి రూ.10 లక్షలు ముట్టజెప్పి పందేలు నిర్వహించుకుందామని, మూడు రోజుల తమకు అదే పని అంటూ వారు మాట్లాడుకున్న వీడియో ఇందుకు సాక్ష్యం.పండగ వేడుకలనూ ఈవెంట్‌లా మార్చారు:రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అప్పులు, ఈవెంట్లు తప్ప మరేమీ కనిపించడం లేదు. పెన్షన్ పంపిణీ పేరుతో ప్రతి నెలా 1న సీఎం చేస్తున్న ఈవెంట్, ఏటా స్కూళ్లలో రొటీన్‌గా జరిగే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం)ను కూడా ఏ స్థాయిలో ఈవెంట్‌లా మార్చి హంగామా చేశారో చూశాం. ఇప్పుడు చివరకు సంక్రాంతి పండగను కూడా విడిచిపెట్టకుండా, ఆ వేడుకలను కూడా ఈవెంట్‌లా మార్చి దోపిడికి సిద్ధమయ్యారు. ఇటీవలే దసరా సందర్భంగా విజయవాడలో గొల్లపూడి వద్ద ఎగ్జిబిషన్ నిర్వహించి ఏం చేశారో చూశాం. కాగా, ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలనూ ఈవెంట్‌లా మార్చిన కూటమి నాయకులు, యథేచ్ఛగా వేల కోట్ల దోపిడి పర్వానికి తెర తీశారని పుత్తా శివశంకర్ ఆక్షేపించారు. -
తెచ్చిన అప్పులంతా వారి జేబుల్లోకే: పుత్తా శివశంకర్
సాక్షి, తాడేపల్లి: లెక్కా జమ లేకుండా ఏడాదిన్నరలోనే రూ.2.80 లక్షల కోట్లు అప్పులు చేసి ఏపీని సీఎం చంద్రబాబు దివాళా అంచున నిలబెట్టాడని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకపోయినా, రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాళ్లు కూడా కనిపించకపోయినా అప్పులు మాత్రం రూ. 2.80 లక్షల కోట్లకు చేరుకున్నాయని వివరించారు.కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలని శివశంకర్ డిమాండ్ చేశారు. మార్క్‌ఫెడ్ నుంచి రూ.18 వేల కోట్లు అప్పులు తెచ్చి కూడా మామిడి రైతులకు మద్ధతు ధర కింద చెల్లించాల్సిన రూ. 260 కోట్లు కూడా ఇవ్వలేదని వివరించారు. చంద్రబాబు అప్పుల ద్వారా తెస్తున్న డబ్బంతా ఆయన బినామీల జేబుల్లోకే చేరుతోందని, అప్పులు తెచ్చిన డబ్బుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ జల్సాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో రెండేళ్లు కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ కూడా కేవలం రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేశారని, అందులోనూ రూ. 2.73 లక్షల కోట్లు డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. కానీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే 2.80 లక్షల కోట్లు అప్పులు చేసినా ఏ ఒక్క దానికీ బాధ్యతగా లెక్కలు చూపించడం లేదని చెప్పారు. పోర్టులు, మెడికల్ కాలేజీలు, ఇళ్ల స్థలాల పంపిణీ, గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు వంటి వాటి ద్వారా వైఎస్ జగన్ సృష్టించిన సంపదను కూటమి నాయకులు దోచుకుతింటున్నారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..ఆ ముగ్గురు ప్రత్యేక విమానాల్లో 70 సార్లు హైదరాబాద్కికూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిన్నరలోనే అప్పులు రూ.2.80 లక్షల కోట్లను మించిపోయాయి. మంగళవారం వారం వచ్చిందంటే అప్పుల కోసం ఆర్బీఐ చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. బడ్జెట్ పరిధిలో చేసిన అప్పులు రూ.1,58,880 కోట్లు కాగా వివిధ కార్పొరేషన్లకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ చేసిన అప్పులు రూ. 71,295 కోట్లు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్.. నిర్మాణానికి ఒక్క రూపాయి కూడా అవసరం లేదంటూనే రాజధాని కోసం చేసిన అప్పు రూ. 47,387 కోట్లు. ఇంత భారీగా అప్పులు చేసి కూడా ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదు.రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి చేసిన ఆనవాళ్లు కనిపించడం లేదు. డీఏలు, పీఆర్సీ, పెండింగ్ బిల్లులు సంగతి పక్కనపెడితే కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతం ఇస్తామన్న హామీని కూడా నెరవేర్చడం లేదు. పదిహేనో తేదీ వచ్చినా కొన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు జమ కావడం లేదు. కానీ అప్పు చేసి తెచ్చిన ఈ డబ్బంతా ఏమవుతున్నట్టు అని ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు ఒక్కొక్కరు 70 సార్లకు మించి హైదరాబాద్‌కి ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ తెచ్చిన అప్పులతో జల్సాలు చేస్తున్నారు. ఇంకోపక్క చంద్రబాబు తన బినామీలకు రాష్ట్ర సంపదను విచ్చలవిడిగా దోచిపెడుతున్నారు.సంపద సృష్టి లేదు.. దోచుకోవడమేవైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అప్పులు తీసుకొచ్చి వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అమలు చేశారు. ఇంకోపక్క మెడికల్ కాలేజీలు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణాలు, గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, హెల్త్ క్లీనిక్‌లు నిర్మించారు. 31 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంతో పాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి దాదాపు 10 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేశారు.ఈ విధంగా రాష్ట్రంలో లక్షల కోట్ల సంపద సృష్టించారు. మొత్తంగా ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో రూ. 3.72 లక్షల కోట్లు అప్పులు చేస్తే.. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎల్లో మీడియా మాత్రం రూ.14 లక్షల అప్పులు చేశారంటూ దుష్ప్రచారం చేశారు. అందులో డీబీటీ ద్వారా ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వివిధ సంక్షేమ పథకాల రూపంలో జమ చేయడం జరిగింది. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పుల్లో 70 శాతంకిపైగా అప్పులు ఏడాదిన్నరలోనే చేశారు.మైనింగ్ ఆదాయం తాకట్టు పెట్టి రూ. 9 వేల కోట్లు అప్పురైతులు పండించిన ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేకపోయినా మార్క్‌ఫెడ్ ద్వారా రూ. 18,700 కోట్లు అప్పులు చేశారు. మామిడి రైతులకు మద్ధతు ధర చెల్లిస్తామని ఇచ్చిన హామీ ప్రకారం రూ.260 కోట్లు చెల్లించాలి. మామిడి రైతులు మద్ధతు ధర కోసం రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా పట్టించుకున్న పాపానపోవడం లేదు. మైనింగ్ ఆదాయాన్ని ప్రైవేటు యాజమన్యాలకు కట్టబెడుతూ రూ. 9 వేల కోట్లు అప్పులు చేశారు. విమానాశ్రయాల కోసం సెంట్ భూమి కొనకపోయినా ఎయిర్‌పోర్టుల అభివృద్ధి పేరుతో వెయ్యి కోట్లు అప్పులు తెచ్చారు.ఏపీ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని తాకట్టు పెట్టి రూ.5,400 కోట్ల అప్పులు తెచ్చారు. రాష్ట్ర అభివృద్ది కోసం చేసే అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి 6.5 శాతంకి మించి వడ్డీ ఉండకూదని ఆర్బీఐ స్పష్టంగా చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించి 9.15 శాతం భారీ వడ్డీ రేట్లతో అప్పులు తెచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడి అప్పులు తెస్తే, వ్యంగ్యంగా హెడ్డింగులు పెట్టి ఎల్లో మీడియా ప్రభుత్వాన్ని తూలనాడింది. కానీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరలోనే దారుణంగా అప్పులు చేస్తుంటే రుణ సమీకరణ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. తనకిష్టమైన చంద్రబాబు అధికారంలో ఉండటంతో అప్పుల వార్తలను లోపలి పేజీల్లో చిన్నవార్తగా ప్రచురించి మమ అనిపిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో వైఎస్ జగన్ సృష్టించిన సంపదను పంచుకుతింటున్నారు. రెండేళ్లు కూడా నిండకుండానే ఏపీని దివాళా అంచున నిలబెట్టారని పుత్తా శివశంకర్ మండిపడ్డారు. -
‘కూటమి పాలనలో అడ్డూ అదుపు లేకుండా పేకాట డెన్లు’
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు పాలనలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. సోమవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గంజాయి, మద్యంతో యువత జీవితాలను రోడ్డున పడేశారని.. అనధికార క్లబ్‌లు నిర్వహిస్తూ కోట్ల బిజినెస్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘2014-19లో కాల్ మనీ రాకెట్‌తో మహిళల జీవితాలను నాశనం చేశారు. ఇప్పుడు విచ్చవిడిగా ఏపీలో క్యాసినోలను నిర్వహిస్తున్నారు. మ్యాంగో బే కల్చరల్ అండ్ రిక్రియేషన్ సొసైటీ వెనుక కూటమి పెద్దల పాత్ర ఉంది. హైకోర్టు అనుమతి ఉందంటూ బోర్డులు కూడా పెట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పోలీసులు, మీడియాను కూడా లోపలకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. 108 అంబులెన్స్‌ను కూడా పేకాట క్లబ్ దగ్గర ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు’’ అని శివశంకర్ పేర్కొన్నారు.‘‘ఇతర రాష్ట్రాల నుంచి కూడా పేకాట కోసం ఏపీకి వస్తున్నారు. ఈ క్లబ్ వెనుక మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరి వివరాలను ప్రభుత్వం బయట పెట్టాలి. పది వేలు, యాభై వేలు, లక్ష చొప్పున మూడు జోన్లగా విభిజించి మరీ పేకాట ఆడిస్తున్నారు. ఆ పక్కన కుటుంబాల వారు చాలాకాలంగా పేకాట ఆడుతున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక విమానాల్లో విలాసాలు చేస్తుంటే.. ఎమ్మెల్యేలు, మంత్రులు పేకాట ఆడిస్తూ డబ్బు దోచుకుంటున్నారు. ఈ పేకాట క్లబ్‌లపై విచారణ జరిపించాలి’’ అని శివశంకర్ డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటన.. అసలు ప్లాన్ అదే’
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని ప్రాంతంలో గతంలో స్టార్టప్‌ల పేరుతో తన బినామీలతో చేసుకున్న అవినీతి ఒప్పందాలను పునరుద్దరించుకోవడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌రెడ్డి మండిపడ్డారు.తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. సింగపూర్ కంపెనీలతో గతంలో తనకు ఉన్న లాలూచీ వ్యవహారాలను తిరిగి కొనసాగించేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే మంత్రి నారాయణను కూడా వెంట తీసుకువెళుతున్నారని అన్నారు. పైకి మాత్రం సింగపూర్‌తో మైత్రి, పెట్టుబడులు అంటూ కట్టుకథలను ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేయించుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..సీఎం చంద్రబాబు అండ్ కో సింగపూర్ పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో ఎల్లో మీడియాలో సింగపూర్ భజన మొదలైంది. వైఎస్ జగన్ నిర్వాకం వల్ల ఆ దేశంతోనే సంబంధాలు దెబ్బతిన్నాయని ఏడుపుగొట్టు వార్త రాసుకొచ్చారు. సొంత అజెండాతో చంద్రబాబు సింగపూర్ వెళ్తుంటే ఆ దేశంతో సంబంధాలు పునరుద్ధరించడానికి సింగపూర్ వెళ్తున్నానని చంద్రబాబు చెప్పగానే ఆయనకు భజన చేస్తూ ఎల్లో మీడియా అదంతా నిజమేనన్నట్టు హడావుడి మొదలెట్టేశారు. వాస్తవానికి చంద్రబాబు పర్యటన వేరు. ఎల్లో మీడియా చేస్తున్న ప్రచారం వేరు.సింగపూర్‌తో మైత్రి దెబ్బతిందని ఎవరు చెప్పారు.?వైఎస్ జగన్ వల్లే సంబంధాలు దెబ్బతిన్నాయని ప్రచారం చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌కి మైత్రి ఎక్కడ దెబ్బతింది? ఏపీ పౌరులు సింగపూర్ వెళ్లడం లేదా? సింగపూర్ నుంచి ఏపీకి రాకపోకలు జరగడం లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? అసలు సంబంధాలు దెబ్బతినడానికి జగన్‌కి ఏంటి సంబంధం? ఆ దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరించడానికి చంద్రబాబు ఎవరు? ఆయనేమన్నా దేశానికి ప్రధానమంత్రా, దేశ విదేశాంగమంత్రా?. భారత దేశంలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకి విదేశాంగ వ్యవహారాలతో ఏం పని?కేవలం ఒకే ఒక్క జూమ్ కాల్తోనే నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారిస్తున్నారని ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నది. అలాంటప్పుడు సింగపూర్ దాకా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది.? ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు జమ కాక సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని విద్యార్థులు బాధపడుతుంటే వారి సమస్యలు పట్టించుకోకుండా సింగపూర్ వెళ్లడానికి ఇదేనా సమయం.? వరుసగా కురుస్తున్న వర్షాలతో రైతాంగం ఖరీఫ్ సీజన్‌కి సన్నద్ధమవుతుంటే, వారికి కావాల్సిన ఎరువులు, విత్తనాలు కల్పించాల్సిన బాధ్యతలను పర్యవేక్షించకుండా చంద్రబాబు రెండు డజన్ల బృందంతో సింగపూర్ పర్యటకు వెళ్లడం ఏంటి.? రైతులకు పెట్టుబడి సాయం కింద అన్నదాత సుఖీభవ ఇచ్చి ఆదుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుకి లేదా?సింగపూర్ ప్రభుత్వం పేరు చెప్పి కన్సార్సింతో ఒప్పందాలుచంద్రబాబు, సింగపూర్‌కి మధ్య ఉన్న సంబంధం ఏంటనేది చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. 2014-19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉండగా రాజధాని నిర్మాణానికి సింగపూర్ ప్రభుత్వంతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలంటూ ఇవే ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు. కానీ జీవోలు రిలీజ్ అయ్యాక చూస్తే సింగపూర్ ప్రభుత్వంతో చంద్రబాబు ఒప్పందం చేసుకున్నట్టు చేసిన ప్రచారం పెద్ద బూటకమని తేలిపోయింది.అసెండాస్ సింగ్‌బ్రిడ్జి, సెంబ్ కార్ప్ కన్సార్సియంతో ఒప్పందాలు చేసుకుని నేరుగా సింగపూర్ ప్రభుత్వంతోనే ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది అనేలా ప్రజల్ని భ్రమింపజేశారు. అమరావతి కోసం మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇచ్చినట్టు మొదట ప్రచారం చేశారు. కానీ ఆ తర్వాత సూర్జానా జురాంగ్ అనే కంపెనీకి టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో అమరావతి మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యత ఇచ్చినట్టు జీవోలు ఇచ్చి, ఆ పని పూర్తి చేసినందుకు రూ.28.96 కోట్లు చంద్రబాబు ప్రభుత్వం చెల్లించింది. టెండర్ లేకుండా నామినేషన్ పద్ధతిలో నేరుగా పనులు అప్పగించి బిల్లులు చెల్లించడాన్ని 2023లో కేంద్ర ఆధీనంలో ఉన్న కాగ్ తీవ్రంగా వ్యతిరేకించింది.స్టార్టప్ ప్రాజెక్టులోనే రూ.లక్ష కోట్ల కుంభకోణంరాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు మాత్రం ప్లాట్లు కేటాయించకుండా గాలికొదిలేసిన చంద్రబాబు ప్రభుత్వం, సింగపూర్ సంస్థల కన్సార్షియం, సీసీడీఎంసీ (కేపిటల్ సిటీ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ కంపెనీ)తో కలిసి ఏర్పాటు చేసే ఏడీపీ (అమరావతి డెవలప్మెంట్ పార్టనర్)కి ప్రభుత్వం 1,691 ఎకరాలను అప్పగించింది. ఎకరం రూ.4 కోట్లు (కనీస ధర)గా నిర్ణయించింది. మొత్తం విలువ రూ.6,764 కోట్లు. వీటిలో 371 ఎకరాలను మౌలిక సదుపాయాలకు కేటాయించాల్సి ఉంటుంది. తొలి విడతగా 50 ఎకరాలు, రెండో దశలో 200 ఎకరాలను సింగపూర్ సంస్థలకు ఉచితంగా అప్పగిస్తుంది. మిగతా 1,070 ఎకరాలను ప్లాట్లుగా వేసి విక్రయిస్తారు.ఈ భూమికి రోడ్లు, నీటి సౌకర్యం, వరద మళ్లింపు వంటి మౌలిక సదుపాయాలన్నీ ప్రభుత్వం సొంత ఖర్చు రూ.5,500 కోట్లతో కల్పిస్తుంది. ఏడీపీలో సీసీడీఎంసీ వాటాగా రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ మొత్తం పెట్టుబడిలో సీసీఎండీసీకి దక్కే వాటా 42 శాతమే. కానీ కేవలం రూ.306 కోట్లు మాత్రమే పెట్టే సింగపూర్ కన్సార్షియంకు దక్కే వాటా 58 శాతం. సింగపూర్ కన్సార్షియంకు తొలుత 50, తర్వాత 200 ఎకరాలను ఉచితంగా కట్టబెట్టేందుకు నాటి చంద్రబాబు సర్కార్ అంగీకరించింది.ఆనాడు అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పన నుంచి స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు వరకు గతంలో సింగపూర్ మంత్రిగా ఉన్న ఈశ్వరన్ కీలక పాత్ర పోషించారు. ‘ఫార్ములా-1 కార్ రేసింగ్ ఒప్పందం’లో ముడుపులు తీసుకున్న కేసులో ఈశ్వరన్ జైలుకెళ్లారు. ఏడాది పాటు జైలు జీవితం అనుభవించి గత నెల జూన్ 5న విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, పురపాలక మంత్రి నారాయణతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్తున్నారు.అమరావతి భూములతో జేబులు నింపుకునే ప్లాన్అమరావతిలో ఎకరం రూ.50 కోట్ల చొప్పున 1,070 ఎకరాలను అమ్మి రూ.53,500 కోట్లను చంద్రబాబు అండ్ కో సింగపూర్ సంస్థల కన్సార్షియం సొమ్ము చేసుకోవడానికి ప్లాన్ వేశాయి. తొలుత 50, రెండో దశలో 200 ఎకరాలను కన్సార్షియంకు ఉచితంగా కట్టబెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఈ 250 ఎకరాలను ఎకరం రూ.50 కోట్ల చొప్పున అమ్ముకున్నా రూ.12,500 కోట్ల మేర సొమ్ము చేసుకోవడమే ఆ సంస్థల ప్లాన్. అంటే గరిష్టంగా రూ.లక్ష కోట్లను చంద్రబాబు అండ్ కో, సింగపూర్ సంస్థలు కాజేయడానికి పథకం పన్నాయని స్పష్టమవుతోంది. 1,691 ఎకరాల స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోనే ఈ స్థాయిలో దోచుకుంటే 34 వేల ఎకరాల రాజధానిలో ఇంకే స్థాయిలో దోపిడీ చేయడానికి ప్లాన్ వేశారన్నది అంచనాలకే అందడం లేదు.కుంభకోణం బయటపడిపోతుందనే భయంతో..2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడటంతో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు వేసిన స్కెచ్‌కు తెరపడింది. కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ఠ దెబ్బతింటుందని భావించిన సింగపూర్ సంస్థల కన్సార్షియం 2019 అక్టోబర్ 30న ప్రాజెక్టు నుంచి వైదొలుగుతున్నట్లు నాటి వైయస్సార్సీపీ ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.వారి అభ్యర్థనల మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది. చంద్రబాబు, లోకేష్ సింగపూర్ పర్యటనకు వెళ్తున్నది రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికా? పెట్టుబడులు పెట్టడానికా అనేది స్పష్టం చేయాలి?. జైలు నుంచి విడుదలైన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌ను కలవడానికి వెళ్తున్నారా లేదా? మైత్రిని పునరుద్ధరించడానికి అన్నట్టు గ్యాస్ కొట్టడం ఆపాలి. అసత్య కథనాలు రాసేముందు పాఠకులు చీకొడతారేమోనన్న విచక్షణతో ఎల్లో మీడియా పనిచేయాలి. -
జాతీయ చానెళ్లు అంటే బాబుకు భయం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, అందుకే జాతీయ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే భయపడతారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ అన్నారు. ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజుల నుంచి వైఎస్ జగన్ జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు. టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలు ఏ ఒక్కటి నెరవేర్చినా ఈపాటి ప్రత్యేక విమానాన్ని ఢిల్లీకి పంపి జాతీయ చానళ్ల రిపోర్టర్లను అమరావతికి రప్పించి నానా యాగీ చేసేవాడన్నారు. ప్రత్యేక హోదాపై యూటర్న్ మీద యూటర్న్ తీసుకోవటం గురించి జాతీయ మీడియా ప్రశ్నిస్తే బాబు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. -
‘పుట్ట’ పగిలింది..
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో విస్తరిస్తోన్న కాంక్రీట్ మహారణ్యాలు..చెట్ల నరికివేత..బ్లాస్టింగ్..ఇతర అభివృద్ధి ప్రక్రియలతో ఒకవైపు మానవాళికి, ఇతర జంతువులకు హానితలపెట్టని విషరహిత పాముల సంఖ్య తగ్గుతుండగా...మరోవైపు విషసర్పాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా ఒకప్పుడు ప్రకృతి సిద్ధంగా.. ఆకుపచ్చని చెట్లతో ఉండే హరిత వాతావరణం, సహజసిద్ధమైన కొండలు, చెరువులు, కుంటలతో కళకళలాడిన ప్రాంతాల్లో ఇటీవలికాలంలో అవన్నీ కనుమరుగై బహుళ అంతస్తుల భవంతులు, అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తుండడంతో పాముల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. గతేడాదిగా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యుల పరిశీలనలో తేలిన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పాముల జాగాలో ఇళ్లు...! పాముపుట్టలో వేలు పెడితే అనర్థాలు తప్పవు అన్న చందంగా మారింది గ్రేటర్లో పరిస్థితి. ఒకప్పుడు వైవిధ్యభరితమైన పాములు మనుగడ సాగించిన ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల భవంతులు వెలుస్తుండడంతో పాముల సహజసిద్ధమైన ఆవాసాలు దెబ్బతింటున్నాయి. దీంతో విభిన్న జాతులకు చెందిన సర్పజాతులు క్రమంగా అంతర్థానమౌతున్నాయి. కాలక్రమేణా నగరంలోని చెరువులు, కుంటలు, పార్కులు ,ప్రభుత్వస్థలాలు కబ్జాకు గురవుతుండడం ఆయా ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవంతులు వెలియడంతో వాటి మనుగడ ప్రశ్నార్థకమౌతోంది. ఖాళీ ప్రదేశాలే విషసర్పాలకు నిలయాలు.... ప్రధానంగా ప్రధాన నగరంలోని జూబ్లీహిల్స్‌తోపాటు శివార్లలోని గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, నెక్నాంపూర్ తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో విషసర్పాలైన నాగుపాములు, స్పెక్టకిల్డ్ కోబ్రా, రస్సెల్వైపర్, కామన్ కైరాట్, స్కా స్కేల్డ్ వైపర్ వంటి విషసర్పాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆయా ప్రాంతాల్లోని ఖాళీ ప్రదేశాల్లో స్థానికులు తడి, పొడిచెత్త, కూరగాయల వంటి వ్యర్థాలను పెద్ద మొత్తంలో డంపింగ్ చేస్తుండడంతో ఈ జాగాల్లో ఎలుకల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో సర్పాల సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం. గతేడాదిగా నగరానికి చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ సొసైటీ అటవీశాఖ సౌజన్యంతో సుమారు 6 వేల సర్పాలను పట్టుకోగా..ఇందులో 3 వేల వరకు నగరంలోనే పట్టుకోవడం గమనార్హం. ఇందులోనూ 70 శాతం వరకు విషసర్పాలే ఉన్నట్లు స్నేక్ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. విషరహిత పాముల మనుగడప్రశ్నార్థకం.. నగరంలో బహుళ అంతస్తుల నిర్మాణం కోసం కొండలను సైతం తొలచివేస్తుండడం..ఈ క్రమంలో బ్లాస్టింగ్ ప్రక్రియ నిర్వహిస్తుండడంతో విషరహిత సర్పాలుగా పేరొందిన రాకీ పైథాన్,బఫ్ స్ట్రైప్డ్ కీల్‌బ్యాక్ తదితర సర్ప జాతుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోందని స్నేక్ సొసైటీ సభ్యులు పేర్కొంటున్నారు. తమకు నిత్యంఇళ్లు, కార్యాలయాలు, ఖాళీప్రదేశాల్లోని పాములను పట్టుకోవాలని కోరుతూ వందకు పైగా ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాము అటవీశాఖ సిబ్బంది సౌజన్యంతో పాములను పట్టుకొని వాటికి ఎలాంటి హాని తలపెట్టకుండా అడవుల్లో తిరిగి వదిలిపెడుతున్నట్లు వారు వివరించారు. -
చవితి సందడి
-
పుత్తా ప్రతాప్ రెడ్డి అర్థ నగ్నంగా నిరసన


