జాతీయ చానెళ్లు అంటే బాబుకు భయం!  | National channels are the fear of the chandrababu | Sakshi
Sakshi News home page

జాతీయ చానెళ్లు అంటే బాబుకు భయం! 

Apr 5 2019 1:20 AM | Updated on Apr 5 2019 1:20 AM

National channels are the fear of the chandrababu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, అందుకే జాతీయ చానెళ్లకు ఇంటర్వ్యూలు ఇవ్వాలంటే భయపడతారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్‌ అన్నారు. ఆయన హైదరాబాద్‌లోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. గత రెండు రోజుల నుంచి వైఎస్‌ జగన్‌ జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలు చూసి చంద్రబాబు భయపడుతున్నారన్నారు.

టీడీపీ మేనిఫెస్టోలోని అంశాలు ఏ ఒక్కటి నెరవేర్చినా ఈపాటి ప్రత్యేక విమానాన్ని ఢిల్లీకి పంపి జాతీయ చానళ్ల రిపోర్టర్లను అమరావతికి రప్పించి నానా యాగీ చేసేవాడన్నారు. ప్రత్యేక హోదాపై యూటర్న్‌ మీద యూటర్న్‌ తీసుకోవటం గురించి జాతీయ మీడియా ప్రశ్నిస్తే బాబు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement