
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్‌సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం కుట్రలు కొనసాగుతున్నాయి. గురువారం వైఎస్ జగన్ తన నెల్లూరు పర్యటనలో భాగంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని పరామర్శించనున్నారు. అయితే వైఎస్ జగన్ నెల్లూరు రానున్న తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది.
గురువారం కాకాణిని వైఎస్ జగన్ పరామర్శించనుండగా.. అదే సమయంలో కాకాణిని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు. రేపటి నుంచి ఐదు రోజులపాటు కస్టడీకి ఇవ్వాలంటూ నెల్లూరు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే, ఆ పిటిషన్‌పై విచారణను కోర్టు వాయిదా వేసింది. కాగా,వైఎస్ జగన్ నెల్లూరు పర్యటనను దృష్టిలో ఉంచుకొని కాకాణిని కస్టడీ కోరడంపై పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వివరాలు
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(జులై 31) నెల్లూరులో పర్యటించనున్నారు. అక్రమ కేసులో జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ములాఖత్ ద్వారా కలవనున్నారు. అనంతరం మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, ఆయన, కుటుంబ సభ్యులతో వైఎస్ జగన్ మాట్లాడనున్నారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు.