
ఏం చేస్తాం.. మేజిస్ట్రేట్ల తీరు అలా ఉంది
కారణాలు చెప్పకుండానే పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మయం
కాకాణి పిటిషన్లపై విచారణ మంగళవారానికి వాయిదా
సాక్షి, అమరావతి: మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సహేతుక కారణాలు చెప్పకుండానే రిమాండ్ విధించడం, పీటీ వారెంట్లు జారీ చేస్తుండటంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ‘ఏం చేస్తాం.. మేజిస్ట్రేట్ల తీరు అలాగే ఉంది. ఇది చాలా దురదృష్టకరం (సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్)’ అని హైకోర్టు ఒకింత ఘాటుగా వ్యాఖ్యానించింది. పలు అభ్యర్థనలతో కాకాణి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
మూడు పిటిషన్లు దాఖలు చేసిన కాకాణి
అక్రమ మైనింగ్ ఆరోపణలపై నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు నమోదు చేసిన ఎస్సీ, ఎస్టీ కేసులో తన బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తూ నెల్లూరు కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. అలాగే మట్టి తవ్వకాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వి.సత్రం పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు పీటీ వారెంట్ జారీ చేస్తూ నెల్లూరు కోర్టు గత నెల 10న జారీ చేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ కాకాణి మరో పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాక టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఫొటోలను మారి్ఫంగ్ చేశారంటూ సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో గుంటూరు కోర్టు తనకు పీటీ వారెంట్ జారీ చేయడాన్ని సవాలు చేస్తూ గోవర్ధన్‌రెడ్డి ఇంకో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మూడు వ్యాజ్యాలు గురువారం జస్టిస్ శ్రీనివాసరెడ్డి ముందు విచారణకు వచ్చాయి.
ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడే సెక్షన్లున్నా కూడా 41ఏ వర్తిందన్నారు
ఈ సందర్భంగా కాకాణి తరఫున సీనియర్ న్యాయవాది ఒ.మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. మట్టి తవ్వకాలకు సంబంధించి కాకాణిపై నమోదైన సెక్షన్లన్నీ ఏడేళ్లకన్నా తక్కువ శిక్ష పడేవేన్నారు. అయినా కూడా మేజిస్ట్రేట్ సెక్షన్ 41ఏ వర్తించదన్నారని తెలిపారు.
అంతేకాక సహేతుక కారణాలు తెలియచేయకుండానే పీటీ వారెంట్ జారీ చేశారన్నారు. మేజిస్ట్రేట్ యాంత్రికంగా వ్యవహరించారని తెలిపారు. ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. మేజిస్ట్రేట్ల తీరుపై వ్యాఖ్యానించారు.
అంతకు ముందు పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ వాదనలు వినిపిస్తూ.. మైనింగ్ కేసులో కాకాణిని మరోసారి తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కింది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, దీనిపై కోర్టు విచారణ జరపనుందని తెలిపారు. అందువల్ల కాకాణి దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణను వాయిదా వేయాలని పలుమార్లు అభ్యరి్థంచారు. దీంతో కాకాణి గోవర్ధన్‌రెడ్డి దాఖలు చేసిన మూడు వ్యాజ్యాల్లో విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.