
సాక్షి, జోగుళాంబ గద్వాల జిల్లా: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. హత్య కేసులో ప్రధాన నిందితులైన తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణాధికారి శ్రీను.. కోర్టు అనుమతితో 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని వివరాలు సేకరించారు.
వాయిస్ మెసెంజర్‌తో గొంతు మార్చి మాట్లాడినట్లు ఇది వరకే బయటపడగా.. తాజాగా మరో ట్విస్ట్ బయటపడింది. తేజేశ్వర్-సహస్రల మధ్య ఎలాంటి కలయిక ఉండరాదనే ఉద్దేశంతో స్పై కెమెరాను కొనుగోలు చేసి తేజేశ్వర్ బెడ్‌రూంలో ఏర్పాటు చేశారు.
తిరుమలరావు నిత్యం వారి కదలికలను కెమెరా ద్వారా గమనించాడు. కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో.. సహస్రను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వా రెంట్‌ను కోర్టుకు సమర్పించారు. ఏ–2 సహస్రను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు తెలుస్తాయని గద్వాల సీఐ శ్రీను వెల్లడించారు.