
ప్రముఖ మలయాళ నటి శ్వేతా మీనన్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఇటీవలే మలయాళ సినీ నటుల సంఘం (AMMA) అధ్యక్షురాలిగా ఎన్నికైన శ్వేత మీనన్ తనపై నమోదైన కేసుపై స్పందించింది. ఓ ఈవెంట్‌కు హాజరైన ఆమె.. 12 ఏళ్ల క్రితం తాను నటించిన చిత్రంపై కేసు నమోదు చేయడం బాధాకరమైన సంఘటన అని తెలిపింది. కేవలం డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో తాను సినిమాలు చేయడం లేదన్నారు. తనకు శత్రువులు ఎక్కువయ్యే కొద్ది.. మరింత రాణిస్తానని శ్వేతా మీనన్ అన్నారు.
శ్వేతా మీనన్ మాట్లాడుతూ.. "శత్రువులు ఎక్కువైతే నేను మరింత ఎక్కువగా రాణిస్తా. ఒక వ్యక్తిగా నాపై కేసు పెట్టడం చాలా బాధాకరం. 12 సంవత్సరాల క్రితం వచ్చిన నా చిత్రాల గురించి ఇలా చేయడం కరెక్ట్ కాదు. ఆ సినిమాలు నాకు రాష్ట్ర అవార్డును తెచ్చిపెట్టాయి. ఇలాంటి కేసును ఎవరూ ఎదుర్కోలేదు. ఆ సమయంలో అమ్మా ఎన్నికల నుంచి వెనక్కి తగ్గాలా అనే అయోమయంలో పడ్డా. కానీ నా కుటుంబం మద్దతు నన్ను ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడు మీ ముందు దెబ్బతిన్న ఆడపులిగా నిలబడ్డా' అని పంచుకుంది.
కాగా.. అధికంగా డబ్బు సంపాదించే ఉద్దేశ్యంతో అశ్లీల, అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన సినిమాల్లో నటించారని ఆరోపిస్తూ శ్వేతా మీనన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మలయాళ మూవీ ఆర్టిస్టుల సంఘం (AMMA) ఎన్నికలకు పోటీ చేస్తున్న సమయంలో ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ సామాజిక కార్యకర్త మార్టిన్ మెనాచేరి మీనన్‌పై కంప్లైంట్ చేశారు. అయినప్పటీకీ అమ్మా మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అంతేకాకుడా శ్వేతా మీనన్కు గతంలో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులలో రెండుసార్లు ఉత్తమ నటిగా గెలుచుకున్నారు. ఫెమినా మిస్ ఇండియా ఆసియా పసిఫిక్ 1994 కిరీటాన్ని కూడా సొంతం చేసుకున్నారు.