ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని.. | Suryapet Sai Santhoshi Jewellers Robbery Case | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని..

Jul 28 2025 12:15 PM | Updated on Jul 28 2025 12:50 PM

Suryapet Sai Santhoshi Jewellers Robbery Case

సూర్యాపేటను ఎంచుకున్న  దుండగులు 

బంగారం దోపిడీ కేసులో మహిళ అరెస్టు 

సూర్యాపేటటౌన్‌: సూర్యాపేటలోని సాయి సంతోషి జ్యువెలరీ షాపులో ఈనెల 21న జరిగిన బంగారం దోపిడీ కేసులో ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు గతంలో ఖమ్మంలో చోరీ చేసి పట్టుబడ్డాడు. దీంతో ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని గ్రహించి సూర్యాపేటలో దొంగతనానికి స్కెచ్‌ వేశాడు. చోరీ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ నరసింహ 5 ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీ చేసింది నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఐదుగురు సభ్యుల ముఠాగా గుర్తించారు. ప్రత్యక్షంగా ఐదుగురు నిందితు లు దొంగతనంలో పాల్గొనగా వారికి సహకరించింది మరో ఇద్దరని గుర్తించారు. దొంగతనంలో సహకరించిన యశోదను అరెస్ట్‌ చేశా రు. ఆదివారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. 

ఆదివారం సూర్యాపేట హైటెక్‌ బస్టాండ్‌ సమీపంలో పోలీసులు ఫింగర్‌ ప్రింట్స్‌ తనిఖీలు చేస్తున్న క్రమంలో అనుమానాస్పదంగా కనిపించిన ఖమ్మంలోని నాయుడుపేటకు చెందిన మేకల యశోద బ్యాగును పరిశీలించగా శ్రీసాయి సంతోషి జ్యువెలరీ షాపులో చోరీకి గురైన కొన్ని ఆభరణాలు లభ్యమయ్యాయి. ఖమ్మం పట్టణంలో నేపాల్‌కు చెందిన ఏ–6 నిందితుడైన అమర్‌బట్‌ గూర్ఖాగా పనిచేస్తుండేవాడు. ఈ కేసులో ఏ–1 నిందితుడు, నేపాల్‌కు చెందిన ప్రకాష్‌అనిల్‌కుమార్‌.. ఖమ్మంలో ఉంటున్న అమర్‌బట్‌ వద్దకు వచ్చి గూర్ఖాగా పనిచేస్తూ యశోదతో సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఖమ్మంలో చోరీ చేస్తే దొరికిపోతామని, సూ ర్యాపేట పట్టణాన్ని ఎంచుకున్నారు. 

ప్రకాష్‌ అనిల్‌కుమార్‌కు తెలిసిన మరో వ్యక్తి నేపాల్‌కు చెందిన కడాక్‌ సింగ్‌తోపాటు, జార్ఖండ్, బిహార్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో ముగ్గురిని పిలిపించుకుని చోరీ చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. మేకల యశోదతో కలిసి సూర్యాపేట ఎంజీ రోడ్డులోని బంగారం షాపు వెనుక ప్రాంతంలో యజమాని లేని ఇంట్లో ఒక రూంను అద్దెకు తీసుకుని, రెక్కీ చేసి, శ్రీసాయి సంతోషి జ్యువెలరీలో షాపులో చోరీ చేశారు.  తర్వాత బంగారం ఇక్కడ అమ్మితే అనుమానం వస్తుందని నేపాల్‌కు తీసుకెళ్లి అమ్ముదామని ఐదుగురు నిందితులు నిర్ణయించారు. 

నిందితురాలు ఇచి్చన సమాచారం మేరకు ప్రత్యక్ష్యంగా చోరీకి పాల్పడిన నేపాల్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన మొత్తం ఐదుగురిని గుర్తించామని ఎస్పీ తెలిపారు. ఏ–1 నిందితుడైన ప్రకాష్‌ అనిల్‌కుమార్‌పై గతంలో ఖమ్మం జిల్లాలో మూడు దొంగతనం కేసులు ఉన్నాయని, మిగిలిన నిందితులపై ఉన్న పాత కేసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితురాలి నుంచి 14 తులాల బంగారాన్ని స్వా«దీనం చేసుకున్నామని ఎస్పీ పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement