జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు | Sensational Facts Come To Light In The Jeedimetla Case | Sakshi
Sakshi News home page

జీడిమెట్ల కేసులో విస్తుపోయే నిజాలు

Jun 24 2025 1:43 PM | Updated on Jun 24 2025 3:41 PM

Sensational Facts Come To Light In The Jeedimetla Case

సాక్షి, హైదరాబాద్‌: జీడిమెట్ల హత్య కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ‘‘మా అక్కే మా అమ్మను చంపింది’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది. ‘‘ట్యూషన్‌ నుంచి వస్తుంటే నన్ను మా అక్క గల్లీలోనే ఆపింది. అమ్మ ఒక ఆంటీని తీసుకుని రమ్మంది.. పదా వెళ్దామంటూ నన్ను తీసుకెళ్లింది. 20 నిమిషాల తర్వాత ఇంటికి తిరిగి వచ్చాం. అప్పటికే కిచెన్‌లో అమ్మ స్పృహ లేకుండా పడి ఉంది. అమ్మను లేపే ప్రయత్నం చేశా..

..అమ్మను నేను చూసుకుంటా నువ్వు బయటకు వెళ్లు అంటూ అక్క చెప్పింది. చుట్టూ పక్కల ఎవరికీ చెప్పవద్దని చెప్పింది.. కానీ అక్క మాత్రం అమ్మ దగ్గరికి కూడా రాలేదు. అమ్మ చనిపోయింది లేపి వేస్ట్‌ అని అక్క చెప్పింది. మా అమ్మ ఇంకా చనిపోలేదని తెలుసుకుని.. శివకు ఫోన్‌ చేసింది. మళ్లీ శివ, యశ్వంత్‌ వచ్చి సుత్తితో అమ్మ తలపై కొట్టాడు’’ అని తేజశ్రీ చెల్లి తెలిపింది.

ప్రేమకు అడ్డు చెప్పిందనే కారణంతో కన్నతల్లిని పదో తరగతి చదువుతున్న కుమార్తె తేజశ్రీ.. ప్రియుడితో కలిసి హతమార్చిన సంగతి తెలిసిందే. బాలికకు కొన్ని నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ యువకుడు పరిచయం కాగా.. అతడితో ప్రేమ వ్యవహారం నడిచింది. దీంతో ఆ బాలిక ఇంటి నుంచి వెళ్లి పోవడంతో తన కుమార్తె కనిపించడం లేదని తల్లి జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ బాలిక మూడు రోజుల క్రితం తిరిగి ఇంటికి వచ్చింది.

ఇదిలా ఉండగా.. తల్లి అడ్డు తొలగించునేందుకు ప్రియడితో కలిసి స్కెచ్‌ వేసింది. నిన్న(సోమవారం) సాయంత్రం నల్లగొండ నుంచి ప్రియుడు శివను రప్పించింది. ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేశాడు. బెడ్‌షీట్‌తో అంజలి ముఖాన్ని శివ కప్పగా.. సుత్తితో తల్లి అంజలిపై కూతురు దాడి చేసింది. శివ తమ్ముడు యశ్వంత్‌ కూడా కత్తితో పీక కోశాడు.

 

 

 

 

 

Advertisement
 
Advertisement
Advertisement